Date seeds : ఖర్జూరం గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా? డయాబెటిస్ ఉన్నవారు తప్పక తెలుసుకోండి!
Date seeds: చాలా మంది ఖర్జూరం తిన్న తర్వాత దాని గింజలను పారేస్తారు. ఇప్పటివరకు మీరు కూడా అలాగే చేస్తున్నట్లయితే, ఇంకోసారి అలా చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఖర్జూరం గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటిని తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.
ఖర్జూరం అంటే అందరికీ ఇష్టం. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి. అయితే ఖర్జూరాలతో పాటు వాటు గింజలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మీకు తెలుసా? ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలుసు, కానీ దాని గింజల వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవచ్చు. అందుకే వాటిని పడేస్తుంటారు. ఇప్పటివరకు మీరు కూడా అలాగే చేస్తున్నట్లయితే, ఇంకోసారి అలా చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఖర్జూరం గింజల్లో ఒలిక్ ఆమ్లం, డైటరీ ఫైబర్, పాలీఫెనాల్స్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, మాంగనీస్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి డయాబెటీస్ నుండి బరువు తగ్గడం వరకు అన్నింటికీ సహాయపడతాయి. ఖర్జూరం గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటిని సేవించడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.
ఖర్జూరం గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యం
ఖర్జూరం గింజల్లో ఒలిక్ ఆమ్లం, డైటరీ ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఖర్జూరం గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది, గుండె పోటు, హార్ట్ ఫెయిల్యూర్, అసాధారణ హృదయ స్పందన వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ
ఖర్జూరం గింజలు కడుపుకు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువ ఆకలిగా కాకుండా, మీ అనారోగ్యకరమైన ఫుడ్ క్రేవింగ్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
బరువు తగ్గడం
ఖర్జూరం గింజలు బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెయిట్ లాస్ ట్రీట్ మెంట్లో చాలా మంది ఖర్జూరం గింజల పొడిని ఉపయోగిస్తుంటారు. ఇది మీకు చాలా సహాయపడుతుంది.
డయాబెటిస్
ఖర్జూరం గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తాయి. దీని కోసం ఖర్జూరం గింజలను వేయించి పొడి చేయండి. ఈ పొడిని ప్రతిరోజూ వేడి నీటితో తీసుకోండి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా చక్కెర స్థాయిలను కూడా సమతుల్యంగా ఉంచుతుంది.
చర్మ కాంతి
ఖర్జూరం గింజలు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిని చర్మ కాంతి కోసం ఉపయోగించవచ్చు. దీని కోసం ఖర్జూరం గింజల పొడిని స్క్రబ్‌గా ఉపయోగించండి. ఇది చర్మంలోని చనిపోయిన కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
ఖర్జూరం గింజలను ఎలా తీసుకోవాలి?
- ఖర్జూరం గింజలను సేవించడానికి ముందుగా కొన్ని గింజలను సేకరించి బాగా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టండి.
- తర్వాత మీడియం మంట మీద పాన్‌ను వేడి చేసి ఈ గింజలను వేయించండి.
- ఈ గింజలు కాస్త గట్టిపడిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేయండి.
- ఇప్పుడు ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో 1 టీస్పూన్ ఈ గింజల పొడిని కలిపి తాగండి.