Anjeer: నానబెట్టిన అంజీర్లను ప్రతిరోజూ తింటే మగవారిలో ఆ సమస్యలేవీ రావు, సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడం ఖాయం
Anjeer: నానబెట్టిన అంజీర్ పండ్లను రోజూ తినడం మొదలుపెడితే, ఎన్నో వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అంజీర పండ్లు అందరికీ మేలు చేస్తాయి. ఎలా తినాలో తెలుసుకోండి.
అంజీర పండ్లు లేదా అత్తి పండ్లు ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఎండిన అత్తి పండ్లను నానబెట్టి తినాలని వైద్యులు తరచుగా సిఫార్సు చేస్తారు. ఇది శరీరం నుండి బలహీనతను తొలగించి, రక్త ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నానబెట్టిన అత్తి పండ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
అంజీర్లను నీటిలో లేదా పాలల్లో నానబెట్టి అయిదారు గంటల తరువాత వాటిని తినాలి. ఇలా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆడవారికి, మగవారికి కూడా ప్త్యేకమైన ఉపయోగాలు ఉన్నాయి.
మలబద్ధకం తగ్గుతుంది
మలబద్ధకంతో బాధపడుతున్నవారికి వారంలో రోజుల్లోనే ఆ సమస్య తగ్గాలంటే ప్రతిరోజూ నానబెట్టిన అత్తిపండ్లను తినాలి. అత్తి పండ్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ తినడం మలం మృదువుగా రావడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
అంజీర్ పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఎలక్ట్రోలైట్ శరీరంలో సమతుల్యతను కలిగి ఉంటాయి. కండరాలతో న్యూరాన్ కదలికను చురుకుగా ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. అంజీర్ పండ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
వయస్సుతో పాటు ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తే, నానబెట్టిన అత్తి పండ్లను తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అత్తి పండ్లలో క్యాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
నానబెట్టిన అత్తి పండ్లను తినడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని కొద్ది మొత్తంలో తినవచ్చు. వీటివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. అయితే వీటిలో ఉండే తీపి కారణంగా, చాలా మంది డయాబెటిస్ రోగులు వీటిని తినేందుకు భయపడతారు. రోజుకు ఒకట్రెండు తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్
స్పెర్మ్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ పాలలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల మేలు జరుగుతుంది. వారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. పురుషుల్లో సంతానలేమి సమస్యను తొలగించి సంతానోత్పత్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లల్నికనేందుకు ప్రయత్నిస్తున్న వారు ప్రతిరోజూ అంజీర్లను తినాల్సిన అవసరం ఉంది.
రక్తహీనత
పిల్లలు, మహిళలు అధికంగా రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. వారు ప్రతిరోజూ అంజీర్లను తినడం వల్ల వారిలో రక్తం ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అంజీర్లను ఈ రోజు నుంచే తినడం ప్రారంభించండి.
స్త్రీలకు మేలు
మహిళల్లో రుతుస్రావానికి ముందు మూడ్ స్వింగ్స్, హార్మోన్ల మార్పుల సమయంలో అత్తి పండ్లను తినడం మంచిది. అలాగే మెనోపాజ్ దశలో అత్తి పండ్లు తినడం వల్ల అనేక సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి మెనోపాజ్ దశకు దగ్గర్లో ఉన్నవారు అంజీర్ పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి.
టాపిక్