Cuffing Season: చలికాలంలో ప్యాచప్.. వాలెంటైన్స్ డేకు బ్రేకప్.. నయా రొమాంటిక్ రిలేషన్‍షిప్ ట్రెండ్.. ఏంటిది?
Cuffing Season: కఫింగ్ సీజన్ ఇటీవల పాపులర్ అవుతోంది. చలికాలంలో మాత్రమే ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటుంది. ఆ తర్వాత కటీఫ్ చెప్పేసుకుంటారు. ఈ కఫింగ్ సీజన్ ఏంటో ఇక్కడ చూడండి.
చలికాలం వచ్చేస్తోంది. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో శరీరాలు వెచ్చదనాన్ని కోరుకుంటాయి. చాలా మంది తమ పార్ట్‌నర్స్ నుంచి వెచ్చదనాన్ని పొందాలని ఆశిస్తారు. అయితే సింగిల్స్‌కు ఇది కష్టవుతుంది. అందుకే దీనికి పరిష్కారంగా ఇటీవల కఫింగ్ సీజన్ అనేది పాపులర్ అవుతోంది. కేవలం చలికాలంలోనే ఉండే రిలేషన్ ఉంది. శరీరానికి వెచ్చదనం కోసమే అమ్మాయి, అబ్బాయి మధ్య ఈ బంధం ఉంటుంది.
వాలెంటైన్స్ డేకు బ్రేకప్
ఈ కఫింగ్ సీజన్ రిలేషన్‍షిప్ చలికాలం మొదలయ్యే సమయంలో స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో సింగిల్‍గా ఉన్న అబ్బాయి, అమ్మాయి రిలేషన్ ప్రారంభిస్తారు. చలికాలమంతా బంధం కొనసాగిస్తారు. వారి ఇష్టాలకు అనుగుణంగా సమయం గడుపుతారు. ఆ తర్వాత వేసవి ప్రారంభమయ్యే వాలెంటైన్స్ డే సమయంలో విడిపోతారు. బ్రేకప్ చెప్పేసుకుంటారు. సాధారణంగా చాలా మంది ప్రేమికుల రోజు కలుస్తారు. కానీ ఈ కఫీంగ్ సీజన్ రిలేషన్‍షిప్‍లో మాత్రం వాలెంటైన్స్ డే దగ్గర్లో విడిపోతారు.
కఫింగ్ సీజన్ ఎందుకు?
కఫింగ్ సీజన్ పేరుతో చలికాలంలో రిలేషన్ కోరుకునేందుకు ఉండే కారణాలను రిలేషన్‍షిప్ ఎక్స్‌పర్ట్ సిద్ధార్థ కుమార్ వివరించారు. ఈ కాలంలో శరీరాలు వెచ్చదనాన్ని కోరుకుంటాయని, దాన్ని పొందేందుకు కొందరు కఫింగ్ సీజన్ ఎంచుకుంటున్నారని అన్నారు.
ఒంటరితనం పోగొట్టుకునేందుకు కూడా దీన్ని ఫాలో అవుతున్నారని తెలిపారు. “వాతావరణం చల్లగా ఉండటంతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీంతో ఒంటరితనం అనే ఫీలింగ్ పెరిగిపోతుంది. ఆ సమయంలో తోడు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అలాగే శరీరానికి వెచ్చదనం ఉండాలని ఆశిస్తారు. దీన్ని తీర్చుకునేందుకు పార్ట్‌నర్ కావాలనుకుంటారు” అని ఆయన వివరించారు. అత్యంత శీతల పరిస్థితులు ఉన్న చోట పురాతన కాలంలోనూ ఈ పద్ధతిని కొందరు పాటించే వారని వెల్లడించారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో బెచింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ అంటూ కొన్ని రకాల షార్ట్ టర్మ్ రిలేషన్లు పాపులర్ అవుతున్నాయి. అందులోకి కఫింగ్ సీజన్ కూడా పాపులర్ అవుతోంది. వీటి వల్ల కొంతకాలమే రిలేషన్ అనే కల్చర్ పెరిగిపోతుంది. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వాడకం పెరగడం, అవి కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుండడం వల్ల షార్ట్ టర్మ్ రిలేషన్స్ అధికమవుతున్నాయి.
కొంతకాలమే అనుకొని మొదలుపెట్టినా.. చాలా మంది లాంగ్ టర్మ్ రిలేషన్ కొనసాగించేందుకు ఇష్టపడతారని, అయితే ఇంటర్నెట్ కల్చర్, సామాజిక ఒత్తిళ్ల వల్ల చాలా మంది అలా చేయడం లేదని సిద్ధార్థ్ వెల్లడించారు. బంధాన్ని మాములుగా భావిస్తూ, త్వరగా విడిపోతున్నారని అన్నారు. షార్ట్ టర్మ్ డేటింగ్ అనుకున్నా.. తమ బంధాన్ని కొనసాగించేందుకు 63 శాతం ఇష్టపడుతున్నారని వెల్లడించారు.