Pappu Chakodilu: పండక్కి పిల్లల కోసం పప్పు చకోడీలు చేస్తున్నారా.. లేదా? క్రిస్పీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవండి-crispy and delicious chickpea rolls pappu chakodi that are perfect for sankranti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pappu Chakodilu: పండక్కి పిల్లల కోసం పప్పు చకోడీలు చేస్తున్నారా.. లేదా? క్రిస్పీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవండి

Pappu Chakodilu: పండక్కి పిల్లల కోసం పప్పు చకోడీలు చేస్తున్నారా.. లేదా? క్రిస్పీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవండి

Ramya Sri Marka HT Telugu
Jan 11, 2025 06:30 AM IST

Pappu Chakodilu: సంక్రాంతి పండుగ దగ్గరకి వచ్చేస్తుంది. ఇప్పటికే పిండివంటలు దాదాపు పూర్తయ్యే ఉంటాయి. మీరు చేసిన పిండి వంటలతో పాటు పిల్లలకు నచ్చేలా ఇలాంటి క్రిస్పీ పప్పు చకోడీలు చేశారంటే, పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు.

పండక్కి పిల్లల కోసం పప్పు చకోడీలు చేస్తున్నారా.. లేదా
పండక్కి పిల్లల కోసం పప్పు చకోడీలు చేస్తున్నారా.. లేదా

సంక్రాంతి పండుగకు స్పెషల్ ఏంటంటే, పిండివంటలే. మరి వాటిల్లో ఒక్కో రకం ఒక్కొక్కరు ఇష్టపడుతుంటారు. కానీ, పిల్లల నుంచి పెద్దోళ్ల వరకూ అందరూ బాగా ఇష్టపడే వంటకం ఏదైనా ఉందంటే అవి పప్పు చకోడీలే. సరదాగా, సంతోషంగా ముచ్చట్లాడుకుంటూ బాతాఖానీ పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా తింటూ ఉంటే ఎన్ని తిన్నామో కూడా లెక్క తెలియదు. మరి ఈ పండుగకు మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తింటూ ఎంజాయ్ చేయడానికి పప్పు చకోడీలు రెడీ చేశారా.. రండి ఈ చక్కటి రెసిపీతో ట్రై చేసి అందరినీ సంతృప్తిపరచండి.

yearly horoscope entry point

కావాల్సిన పదార్థాలు:

  • నూనె
  • బియ్యపు పిండి
  • శెనగపిండి
  • పసుపు
  • ఉప్పు
  • కారం
  • వాము పొడి
  • శెనగపప్పు

పప్పు చకోడీలు తయారు చేసే విధానం:

  • ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి.
  • నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో పొడి బియ్యపు పిండిని వేయండి.
  • ఒక కప్పు బియ్యపు పిండికి రెండు టేబుల్ స్పూన్ల కొలతతో శెనగపిండిని తీసుకోవాలి.
  • చిన్న మంటపై ఉంచి పిండి రంగు మారేంత వరకూ వేయించి వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోండి.
  • పచ్చి శనగపప్పు తీసుకుని కనీసం రెండు గంటల పాటు నానబెట్టాలి.
  • ఆ తర్వాత ఆ పప్పును తీసుకుని నీళ్లు వడపోసి, తడి ఆరేవిధంగా ఒక కాటన్ క్లాత్‌లో ఆరబెట్టాలి.
  • ఇప్పుడు ముందుగా వేయించి పక్కకుపెట్టుకున్న పిండి చల్లారిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, వాము పొడి వేసి కలుపుకోండి.
  • ఇవన్నీ చక్కగా కలిసిన తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మెత్తగా అయ్యేంత వరకూ కలుపుకోవాలి.
  • పిండి బాగా వదులుగా కాకుండా చూసుకోండి.
  • ఇప్పుడు పిండి అంటుకోకుండా ఉండేందుకు చేతికి కాస్త నూనె రాసుకోండి.
  • పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకుని ఉండలుగా చేయండి. ఇప్పుడు ఈ ఉండను తీసుకుని ఒక ప్లేట్ లేదా చపాతీల పీట మీద పెట్టి రోల్ చేస్తూ సన్నగా పొడుగ్గా అయ్యే విధంగా చేయండి.
  • ఇప్పుడు రోల్ చేసిన పిండిని ముందుగా మనం నానబెట్టుకుని పక్కకుపెట్టుకున్న శెనగపప్పులో వేసి రోల్ చేయండి.
  • ఇలా చేయడం వల్ల మధ్యలో పప్పులు అతుకుతాయి. తర్వాత ఈ పొడవాటి రోల్స్‌ రెండు అంచులను కలిపి అతికించండి.
  • ఈ లోపు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని, దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని మరిగించండి.
  • నూనె వేడెక్కేంత వరకూ మిగిలిన పిండితో చకోడీలను తయారుచేసుకోండి.
  • వేడెక్కిన నూనెలో చకోడీలను వేసి వేయించండి. అంతే కరకరలాడే పప్పు చకోడీలు రెడీ అయినట్లే. ఈ సంక్రాంతికి సకినాలు, గారెలు, అరిసెలతో పాటు ఇలా పప్పు చకోడీలు కూడా తిన్నారంటే, పిల్లలు ఇష్టంగా తింటారు.

Whats_app_banner

సంబంధిత కథనం