Homemade Moisturizer: గులాబీ పువ్వులను పడేయకండి..! ఇంట్లోనే మాయిశ్చరైజర్ తయారు చేసుకోవచ్చు మెరిసే చర్మాన్ని పొందచ్చు
Homemade Moisturizer: ఇంట్లో గులాబీ పువ్వులు ఎక్కువగా ఉంటే పడేయకండి. తాజా పువ్వులతో మాయిశ్చరైజర్ తయారు చేసుకున్నారంటే ఎలాంటి క్రీములు అవసరం లేకుండా చర్మం మృదువుగా, మెరిసేలా తయారవుతుంది. ఈ క్రీం తయారు చేయడం కూడా చాలా సులువు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.
సౌందర్యానికి రోజ్ వాటర్ ఎంత ఉపయోగకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గులాబీ పువ్వులతో కేవలం రోజ్ వాటర్ మాత్రమే కాదు.. మాయిశ్చరైజర్ కూడా తయారు చేయొచ్చని మీకు తెలుసా. అవును స్వయంగా మీరే ఇంట్లో ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. గులాబీ పువ్వులు చర్మానికి మంచి తేమను అందించే శాంతిదాయక గుణాను కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. అలాగే హానికారక పదార్థాలను చర్మం నుంచి తొలగిస్తుంది.
శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా మారి ప్రజలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇంట్లో గులాబీ పూలతో చేసిన మాయిశ్చరైజర్ వాడండి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా తయారు చేయడమే కాకుండా.. పింక్ గ్లో కూడా కనిపిస్తుంది. రోజ్ మాయిశ్చరైజర్ తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ మాయిశ్చరైజర్ కోసం కావలసిన పదార్థాలు:
- తాజా గులాబీ పువ్వులు – 8 నుంచి 10
- కొబ్బరి నూనె లేదా పెట్రోలియ జెల్లీ – 2 చెంచాలు
- ఆల్మండ్ నూనె – 1 చెంచా
- వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ – 2 లేదా 3 చుక్కలు(ఇది తప్పని సరేం కాదు)
- రోజ్ వాటర్ – 1/4 కప్పు
రోజ్ మాయిశ్చరైజర్ తయారీ విధానం:
1. తాజా గులాబీ పువ్వులను తీసుకుని వాటి రేకులను తుంచి పెట్టుకోండి. బయట కొన్న హైబ్రిడ్ గులాబీ పువ్వుల కన్నా ఇంట్లో చెట్టు మీద ఉండే సహజమైన రసాయనాలు లేని పువ్వులు ఉపయోగించడం మంచిది.
2. ఇప్పుడు గులాబీ రేకులను ఒక చిన్న బౌల్లో వేసి దాంట్లో పావు కప్పు రోజ్ వాటర్ పోసి కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకూ నాననివ్వండి.
3. రోజ్ వాటర్ లో గులాబీ రేకులు చక్కగా నానిని తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వాటిని వేసి మెత్తగా పేస్టులాగా చేయండి.
4. ఇప్పుడు ఈ పేస్టును గట్టిగా పిండుతూ పూర్తిగా వడకట్టండి.
5. తరువాత ఈ మిశ్రమంలో ఆల్మండ్ నూనె,ఏదైనా పెట్రోలియం జెల్లీ(వాజెలిన్) లేదా కలబంద గుజ్జు లేదా కొబ్బరి నూనెను ఏదైనా సరే వేసి బాగా కడపండి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉండానికి ఉపయోగపడతాయి.
6.తరువాత దీంట్లో మీకు వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ అందుబాటులో ఉంటే కలపండి. ఇది మాయిశ్చరైజర్ కు చక్కటి సువాసనను జోడించడంతో పాటు చర్మానికి మంచి హైడ్రేషన్ ఇవ్వడంలో సహాయపడుతుంది.
7. ఈ పేస్ట్ ను గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ ఫ్రిజ్ లో చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది.
ఎప్పుడు రాసుకోవాలి?
గులాబీ పూలతో తయారు చేసిన ఈ మాయిశ్చరైజర్ ను రోజూ స్నానం చేసే ముందు ముఖం, మెడ, చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇది చర్మానికి మృదువైన, మృదువైన ఆకృతితో పాటు గులాబీ మెరుపును ఇస్తుంది.
సంబంధిత కథనం