హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ కావాలంటే పల్లీ చాట్ ఫర్ఫెక్ట్ ఛాయిస్! రెసిపీ కూడా చాలా సింపుల్-craving a healthy tasty snack try this boiled peanut chaat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ కావాలంటే పల్లీ చాట్ ఫర్ఫెక్ట్ ఛాయిస్! రెసిపీ కూడా చాలా సింపుల్

హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ కావాలంటే పల్లీ చాట్ ఫర్ఫెక్ట్ ఛాయిస్! రెసిపీ కూడా చాలా సింపుల్

Ramya Sri Marka HT Telugu

ఆరోగ్యకరమైన,రుచికరమైన స్నాక్ తినాలనిపిస్తోందా? అయితే పల్లీ చాట్ రెసిపీ మీ కోసమే. కడుపు నిండా, కమ్మగా ఉండే ఈ ఉడికించిన పల్లీ చాట్‌ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. పైగా ఇది తేలికగా జీర్ణమవుతుంది కూడా. మరి లేటెందుకు పల్లీ చాట్ తయారు చేయడం ఎలాగో చూసేద్దాం రండి.

పల్లీలతో తయారు చేసిన రుచికరమైన చాట్

సాయంత్ర కాగానే నాలుక చిరుతిళ్లను కోరుతుందా? ఏదైనా హెల్తీగా, టేస్టీగా తినాలి అనిపిస్తుందా? అయితే బయట దొరికే వాటి జోలికి వెళ్లకండి. ఇంట్లోనే చిటికెలో అదిరిపోయే స్నాక్ తయారు చేసుకుని తినండి. అది కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండే పల్లీలతో. వేయించిన పల్లీలతో చేసే చాట్ గురించి మనకు తెలుసు, కానీ ఇప్పుడు మనం ఉడికించిన పల్లీలతో మరింత ఆరోగ్యకరమైన, కడుపు నింపే చాట్ ఎలా చేయాలో చూద్దాం. రుచిలో ఏ మాత్రం తగ్గకుండా, ఆరోగ్యానికి మేలు చేసేలా పల్లీ చాట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.

పల్లీ చాట్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • పచ్చి పల్లీలు - 1 కప్పు
  • ఉల్లిపాయ - 1 చిన్నది (సన్నగా తరిగినది)
  • టమాటో - 1 చిన్నది (గింజలు తీసి సన్నగా తరిగినది)
  • పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగినది, మీ కారానికి తగ్గట్టు)
  • కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది)
  • నిమ్మరసం - 1-2 టీస్పూన్లు (రుచికి తగ్గట్టు)
  • చాట్ మసాలా - ½ టీస్పూన్
  • కారం పొడి - ¼ టీస్పూన్ (లేదా రుచికి తగ్గట్టు)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చిటికెడు పసుపు (పల్లీలు ఉడికించేటప్పుడు)(అవసరమైతే)
  • చిటికెడు జీలకర్ర పొడి(అవసరమైతే)
  • చిటికెడు ఆమ్‌చూర్ పౌడర్ (మామిడి పొడి - పులుపు కోసం)(అవసరమైతే)
  • సన్న కారప్పూస/సేవ్ (పైన చల్లుకోవడానికి)(ఇంట్లో ఉంటేనే తప్పనిసరి మాత్రం కాదు)

పల్లీ చాట్ తయారు చేసే విధానం:

  1. పల్లీ చాట్ తయారు చేయడం కోసం ముందుగా పచ్చి పల్లీలను శుభ్రంగా కడిగి 4-5 గంటలు నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతాయి.
  2. నానబెట్టిన పల్లీలను ప్రెషర్ కుక్కర్‌లో వేసి, పల్లీలు మునిగే వరకు నీళ్లు పోయండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపండి.
  3. కుక్కర్‌ను మూత పెట్టి, మీడియం మంటపై 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పల్లీలు మెత్తగా ఉడకాలి కానీ పేస్ట్ అవ్వకూడదు.
  4. ప్రెషర్ తగ్గిన తర్వాత, పల్లీలను నీరు లేకుండా వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి.
  5. ఇప్పుడు ఉడికించిన పల్లీలు ఉన్న గిన్నెలో, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి.
  6. తరువాత దీంట్లో చాట్ మసాలా, కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. మీరు కావాలనుకుంటే చిటికెడు జీలకర్ర పొడి లేదా ఆమ్‌చూర్ పౌడర్ కూడా వేయవచ్చు.
  7. చివరగా, నిమ్మరసం పిండుకుని అన్ని పదార్థాలు పల్లీలకు బాగా పట్టేలా గరిటెతో లేదా చేత్తో నెమ్మదిగా కలపండి.
  8. రుచి చూసి, అవసరమైతే ఉప్పు, కారం లేదా నిమ్మరసం సర్దుబాటు చేసుకోండి. అంతే హెల్తీ అండ్ టేస్టీ పల్లీ చాట్ రెడీ అయినట్టే.

దీన్ని వెంటనే వేడి వేడిగా తిన్నా కాస్త చల్లారిన తర్వాత తిన్నా అదిరిపోతుంది. వడ్డించే ముందు పైన కొద్దిగా సన్న కారప్పూస/సేవ్ చల్లితే మరింత రుచిగా ఉంటుంది. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.