శీతాకాలంలో మొక్కజొన్న రొట్టె తినడం చాలా ఆచారాల్లో సంప్రదాయంగా ఉంది. పంజాబ్‌లో కచ్చితంగా చలికాలంలో మొక్కజొన్న రోటీని తింటారు. మొక్కజొన్న చపాతీని ఎగ్ బుర్జీ, చికెన్ కర్రీ వంటివి తింటే చాలా రుచిగా ఉంటాయి. మొక్కజొన్న రోటీ రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పూర్తిగా భిన్నమైన రుచితో మొక్కజొన్న రొట్టెను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
మొక్కజొన్న పిండి - రెండు కప్పులు
వెల్లుల్లి రెబ్బలు - పది
మెంతి ఆకులు - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
ఎండు మిర్చి - నాలుగు
కసూరిమేథి - ఒక స్పూను
నెయ్యి - ఒకస్పూన్
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఈ జొన్న పిండి రోటీ తినడం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిదే. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో మేలు జరిగేలా చేస్తుంది. దీన్ని ఆకుకూరలతో వండిన కర్రీతో తిన్నా, చికెన్ కర్రీ, ఎగ్ బుర్జీ తో తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. మొక్కజొన్నలతో చేసే పిండిని ఒకసారి కొని తెచ్చుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రోటీలను చేసుకోవచ్చు. ఈ కార్న్ రోటీలో మనం కొత్తిమీర, వెల్లుల్లి, మెంతులు వేశాము, ఈ మూడు కూడా మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి వారానికి రెండు మూడు సార్లయిన ఈ రోటీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
టాపిక్