Shahi Paneer: చపాతీ రోటీల్లోకి కొన్ని నిమిషాల్లో షాహీ పనీర్ ఇలా వండేయండి, రెసిపీ ఇదిగో
Shahi Paneer: కొన్ని నిమిషాల్లోనే పనీర్ కర్రీ వండేయచ్చు. మేము ఇక్కడ చెప్పిన పద్ధతిలో షాహీ పనీర్ వండి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. షాహీ పనీర్ కొన్ని నిముషాల్లోనే ఎలా వండాలో తెలుసుకోండి.
పనీర్ కర్రీ ఎంతో మందికి ఇష్టమైన కర్రీ. కానీ అది వండేందుకు ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటారు. నిజానికి చాలా సింపుల్ పద్ధతిలో షాహీ పనీర్ కర్రీ వండేయచ్చు. మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ పనీర్ కూర ప్రయత్నించండి. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. షాహీ పనీర్ కర్రీ సింపుల్ రెసిపీ తెలుసుకోండి.

షాహీ పనీర్ రెసిపీకి కావలసిన పదార్థాలు
నూనె - రెండు స్పూన్లు
బటర్ - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
ఎండు మిరపకాయలు - రెండు
ఉల్లిపాయలు - రెండు
టమోటాలు - రెండు
అల్లం - చిన్న ముక్క
జీడిపప్పు - పది
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
పనీర్ క్యూబ్స్ - ఒక కప్పు
కాశ్మీరీ కారం - ఒక స్పూన్
గరం మసాలా - ఒక స్పూన్
చక్కెర - చిటికెడు
కసూరి మేథి - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఫ్రెష్ క్రీమ్ - ఒక కప్పు
షాహీ పనీర్ రెసిపీ
- స్టవ్ మీద కళాయి పెట్టి నూనె, వెన్న వేసి వేడిచేయాలి.
- నూనె వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
- సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి.
- ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాక టమాటో తరుగును వేసి బాగా కలపాలి.
- అందులో పసుపు, ఉప్పు, కాశ్మీరీ కారం, కసూరి మేథి వేసి బాగా కలుపుకోవాలి.
- జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇగురులాగా వేశాక పనీర్ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి.
7. చిటికెడు చక్కెర వేసి కలుపుకోవాలి. అవి ఉడకడానికి పావు గ్లాసు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.
8. ఈ మొత్తం ఇగురులాగా అయ్యాక పైన కొత్తిమీర తరుగు వేసి చల్లుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.
9. అంతే టేస్టీ షాహీ పనీర్ రెడీ అయినట్టే. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
దీన్ని బగారా రైస్, చపాతీ, రోటీలతో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే ఎంతో ఇష్టంగా మీరు దీన్ని తింటారు. దీన్ని కేవలం మీరు 20 నిమిషాల్లో వండేసుకోవచ్చు. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.