Parenting tips: ఈ విషయాలు పిల్లలు వినేలా మాట్లాడుకుంటేనే మంచిదట..
Parenting tips: పిల్లలు వింటున్నారని, వినకూడదని కొన్ని విషయాలు మెల్లగా మాట్లాడుకుంటాం. అయితే కొన్ని మాత్రం పిల్లల చెవిన పడితేనే మంచిదట. అవేంటో చూద్దాం.
ఒక పేరెంట్ గా పిల్లల్ని ఉత్తమంగా పెంచాలనుకుంటాం. వాళ్లకు మంచి విలువలు నేర్పిస్తాం. మనం చేసేదే, మాట్లాడేదే పిల్లలు నేర్చుకుంటారని ఆచీతూచీ వ్యవహరిస్తాం. కానీ కొన్ని విషయాలు మాత్రం పిల్లల చెవిన పడితే మంచిది కాదేమో అనే సందేహంతో మెల్లగా మాట్లాడతాం. మనం ఏదైనా మాట్లాడుకునేటపుడు పిల్లలు వెంటే పక్కకు వెళ్లి ఆడుకోమని చెప్పకుండా కొన్ని విషయాలు వాళ్ల ముందు మాట్లాడితేనే మంచిదట.
పిల్లలు వినేలా మాట్లాడుకుంటే తప్పులేని కొన్ని విషయాలేంటో తెలుసుకోండి:
సమస్యలు పరిష్కరించడం:
ఏదైనా సమస్య ఎందుకొచ్చిందో, దాన్నుంచి మీరు బయటపడటానికి ఎలాంటి పరిష్కారం కనుగొన్నారు. ఈ విషయాలన్నీ వాళ్లముందు చర్చిస్తేనే మంచిది. సమస్యలొచ్చినా వాటికి పరిష్కారాలుంటాయని తెలుసుకుంటారు.
పిల్లల గురించి మంచి విషయాలు మాట్లాడేటపుడు:
పిల్లను నేరుగా అభినందించినా కూడా, వేరే వ్యక్తుల ముందు వారి గురించి మంచిగా చెబుతున్నప్పుడు వాళ్లు విన్నా పరవాలేదు. దానివల్ల వాళ్ల ఆత్మస్తైర్యం పెరుగుతుంది. మానసికంగా బలంగా తయారవుతారు. వాళ్లు అలా వింటే ఆనందంగా కూడా ఫీల్ అవుతారు.
భావోద్వేగాలు:
ఒక్కోసారి బాగా బాధగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఏడుపొస్తుంది. ఇలా చాలా ఎమోషన్లుంటాయి. వాటిని బయటకు చెప్పడం చాలా అవసరం. పిల్లలున్నారని వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన రీతిలో మీరు వాటినుంచి బయటపడ్డప్పుడు, భావోద్వేగాలను నియంత్రించుకున్నపుడు పిల్లలు కూడా అలాగే చేయడం నేర్చుకుంటారు.
క్షమాపణ:
మీరేదైనా తప్పుచేసి దాన్ని ఒప్పుకుని క్షమాపన అడుగుతున్నప్పుడు పిల్లల ముందు వద్దనే ఆలోచన వద్దు. దాన్ని చూసే పిల్లలు కూడా తక్కువ వయసులోనే తప్పొప్పుల గురించి, నడవడిక గురించి నేర్చుకుంటారు.
ధైర్యంగా నిలబడటం:
ఏదైనా తప్పు జరిగినపుడు, తప్పులేకుండా ఏదన్నా ఎవరన్నా అంటున్నప్పుడు మీకోసం మీరు మాట్లాడుకోగలగాలి.
టాపిక్