మొక్కల ఆధారిత ఆహారంతో దీర్ఘాయుష్షు.. తేల్చిన పరిశోధన
పర్యావరణానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం వల్ల ఆయుష్షు 25 శాతం పెరుగుతుందని న్యూట్రిషన్ 2023లో సమర్పించిన అధ్యయనంలో తేలింది.
పర్యావరణానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎక్కువ కాలం గడపవచ్చని కొత్త పరిశోధనలు తేల్చాయి. 30 సంవత్సరాలకు పైగా జరిపిన ఒక అధ్యయనంలో సంబంధిత విషయాలు తేటతెల్లమయ్యాయి. ఇలాంటి ఆహారం తినేవారికి త్వరగా మరణించే అవకాశం 25 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
ట్రెండింగ్ వార్తలు
తృణధాన్యాలు, పండ్లు, పిండి పదార్థాలు లేని కూరగాయలు, కాయలు అసంతృప్త నూనెలు మేలు చేస్తాయని అధ్యయనం తేల్చింది. అయితే జంతు మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాలు వంటివి ఇటు మానవ ఆరోగ్యానికి, అటు పర్యావరణానికి హాని కలిగిస్తాయని స్పష్టం చేసింది.
పర్యావరణానికి మేలు చేసే ఆహారాలను గుర్తించిన మునుపటి అధ్యయనాలను ఈ పరిశోధన విస్తరించింది. ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ అనారోగ్యాలు, నాడీ సంబంధిత రుగ్మతలు తక్కువగా ఉంటాయని, వీటి ద్వారా మరణించే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం తేల్చిందని హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పోషకాహార విభాగంలో పీహెచ్‌డీ అభ్యర్థి లిన్హ్ బుయ్ చెప్పారు.
బోస్టన్ లో జరిగే అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను సమర్పించనున్నారు. మొక్కల ఆధారిత ఆహారాలు గుండె జబ్బులు, కొలొరెక్టల్ క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ముప్పును తగ్గిస్తాయని ఈ అధ్యయనం రుజువు చేసింది. నీటి వినియోగం, భూ వినియోగం, పోషక కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలు వంటి కారకాల పరంగా పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపుతాయి.
టాపిక్