Foods for Viral Infections: వైరస్‌లతో పోరాడేందుకు శీతాకాలంలో ఈ ఫుడ్స్ తీసుకోండి, కష్టకాలంలో కనికరించే 7 రకాల ఫుడ్స్ ఇవే
Foods for Viral Infections: వైరస్‌ల బెడద మళ్లీ మొదలైంది. చైనా నుంచి మొదలై భారత్‌కు చేరుకున్న హెచ్ఎంపీవీ వైరస్‌తో అందరిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి కష్టకాలంలో కూడా ధైర్యంగా బడికి పంపాలంటే వారిలో రోగనిరోధక శక్తి ఉందని మనం నమ్మ గలిగినప్పుడే. అలాంటి శక్తి రావాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారాలేంటో తెలుసా!
హెచ్ఎంపివి వైరస్ భారత్‌కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటంతట అవి పని చేసుకుంటూ పోతాయి. కానీ, వ్యక్తిగతంగా మనం ఎంతవరకూ అప్రమత్తంగా ఉన్నామనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. వైరస్ మనకు సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం తెలుసు. కానీ, ఒకవేళ వైరస్ మనకు వస్తే ఎదుర్కోవడానికి ఎంతవరకూ సిద్ధంగా ఉన్నాం. తట్టుకునేంత ఇమ్యూనిటీని సంపాదించుకున్నామా.. ఒకవేళ లేకపోతే ఎటువంటి ఆహారంతో ఆ శక్తిని పొందగలమో తెలుసుకోండి.
వైరస్‌లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ కోసం:
1) రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో భాగం చేసుకోండి. విటమిన్లు ఏ, సి, డి, ఈ అలాగే జింక్, సెలీనియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోండి.
2) అలాగే సైట్రస్ పండ్లు అయిన నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
3) పాలకూర, బ్రొకోలీలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
4) ఆరోగ్యకరమైన గట్‌ను ప్రోత్సహించడానికి మీ ఆహారంలో పెరుగు, క్యాబేజి, లేదా క్యారెట్ తో తయారుచేసిన వంటకాలను తినండి. పేగులు ఆరోగ్యంగా ఉంటే మీ రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది.
5) శరీరంలో ఉన్న విషాన్ని బయటకు పంపడానికి, ఉత్తమంగా పనిచేయడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.
6) గ్రీన్ టీ, చమోమిలే లేదా అల్లం టీ వంటి హెర్బల్ టీలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
7) బాదం పప్పులను మీరు రోజూ ఉదయం ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ఇందులో ఉండే విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది.
8) వెల్లుల్లిని డైట్ లో చేర్చుకోవాలి. దీనిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది:
అలవరచుకోవాల్సిన పనులు:
1) రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. తగినంత విశ్రాంతి మీ రోగనిరోధక శక్తితో పాటు మొత్తం ఆరోగ్యానికి మంచిది. రోజువారీ నిద్ర షెడ్యూల్ క్రమం తప్పకుండా పాటించండి.
2) చాలా చల్లని ఉష్ణోగ్రతల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చక్కటి కంఫర్ట్ ను కలిగే దుస్తులను ధరించండి. చల్లని గాలిని పీల్చుకోకుండా ఉండటానికి బయటకు వెళ్ళేటప్పుడు మీ నోరు, ముక్కును కవర్ అయ్యేలా మాస్కులు ధరించండి.
3) మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచింది. ఇవి ఉన్న వారిలో రోగనిరోధక శక్తిని బలహీనంగా ఉంటుంది.
4) శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. పగటిపూట ఆరుబయట కొంచెం సమయం గడపడం వల్ల విటమిన్ డి పెరుగుతుంది. నిపుణుల సలహాతో విటమిన్ డి మెడిసిన్ కూడా తీసుకోవచ్చు.
సంబంధిత కథనం