Skin Tone and Dress Colour : ఇండియన్స్ ఈ రంగు దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు!
Skin Tone and Dress Colour : ఇతర దేశాల వారితో పోలీస్తే భారతీయుల చర్మం భిన్నంగా ఉంటుంది. అయితే మనలాంటి చర్మం ఉన్నవారికి ఏ రంగు దుస్తులు బాగుంటాయో తెలుసుకోండి.

ప్రపంచంలో ఇతర దేశాలకంటే.. మన దేశంలోనివారి స్కిన్ వేరేగా ఉంటుంది. ఎలాంటి బట్టలు వేసుకున్నా అందంగా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల దుస్తులు మెరిసేపోయేలా చేస్తాయి. అయితే మనం వేసుకునే దుస్తుల రంగులు మనల్ని ఇతరులు ఆకర్శించేలా చేస్తాయి. అందరిలో మనం ప్రత్యేకంగా ఫోకస్ అవుతాం. ముఖ్యంగా మన స్కిన్ టోన్ విషయానికి వస్తే మనం మరీ తెల్లగానూ, మరీ ముదురు రంగులోనూ ఉండం. తెలుపు-గోధుమ రంగు కలిగిన వాళ్లం. ఇందులో చాలా షేడ్స్ కూడా ఉన్నాయి. మన చర్మ రంగును ఆధారంగా దుస్తుల రంగులను ఎంచుకోవాలి. అప్పుడే అందంగా కనిపిస్తారు.
దుస్తులు ఎంత సింపుల్‌గా ఉన్నా లేదా ఖరీదైనవైనా అందరికీ సరిపోయే కొన్ని రంగులు ఉంటాయి. ఈ రంగు బట్టలు ప్రధానంగా భారతీయుల చర్మానికి అనుకూలంగా ఉంటాయి. అలాంటి రంగులు ఏంటో చూద్దాం. భారతీయుల చర్మానికి సరిపోయో రంగులు కింద ఉన్నాయి.
ఆలివ్ రంగు చాలా అందంగా ఉంటుంది. రాత్రి పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించే చాలా అద్భుతమైన రంగు ఇది. భారతీయుల విభిన్న చర్మపు రంగులపై అద్భుతంగా కనిపించే శక్తి దీనికి ఉంది. ఆలివ్ జంప్‌సూట్‌లలో చాలా మంది నటీమణులను మనం ప్రతిసారీ చూస్తాం. దీని ప్రకారం ఈ రంగు మన చర్మానికి సరిపోతుంది. ఇతరులను ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.
భారతదేశంలోని చాలా మంది రాజకుటుంబాలు ఎక్కువగా ఇష్టపడే రంగులలో ఒకటి ఆకుపచ్చ. ఈ రంగు వేసుకుని నగలు వేసుకుంటే అందరిలో మీరే ప్రత్యేకంగా ఉంటారు. ఈ రంగును నగలలోనూ ఉపయోగిస్తారు. ఆభరణాల్లో ఈ రంగు స్టోన్స్ వాడుతారు. అంతేకాదు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకుంటే కచ్చితంగా అందరికీ నచ్చుతారు. ఈ రంగు అన్ని స్కిన్ టోన్‌లకు కచ్చితంగా సరిపోతుంది.
క్రిమ్సన్ కలర్ కూడా భారతీయులకు బాగుంటుంది. ఎరుపులో ఊదా కొంచెం కలిసినట్టుగా అనిపిస్తుంది. పెళ్లిళ్లు లేదా ఇతర కార్యక్రమాలకు క్రిమ్సన్ హైలైట్ కలర్. మేకప్ ఇష్టం లేకుంటే సింపుల్ గా ఉండాలంటే క్రిమ్సన్ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. ప్రతీ ఒక్కరూ మీ వైపే చూస్తారు.
చాలామంది అమ్మాయిలు అభిమాన రంగు బ్లష్ పింక్. ఇది అందరికీ ఇష్టమైనది. ఈ రంగు మంచి రూపాన్ని ఇస్తుంది. ధరించినవారి ఆకర్షణను పెంచుతుంది. ఈ రంగు డ్రెస్ వేసుకుని.. డైమండ్, నెక్లెస్‌తో వేసుకుంటే అందరిలో మీరే భిన్నంగా కనిపిస్తారు.
వంకాయ ఊదా రంగు.. ఇది భారతీయుల చర్మానికి సరిగ్గా ఉంటుంది. మీరు బ్రౌన్, మెరూన్ మొదలైనవి ఇష్టపడకపోతే.. ఈ రంగు మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
నలుపు రంగును దాదాపు ప్రతి ఒక్కరూ అనేక కారణాల వల్ల ఇష్టపడతారు. ఇది మిమ్మల్ని స్లిమ్‌గా కనిపించేలా చేస్తుంది. కాంతివంతంగా కనిపించడంలో సహాయపడుతుంది. మీరు సాధారణ నలుపు చీర లేదా నలుపు గౌను ధరించినా మొత్తం లుక్ మారిపోతుంది.
పసుపు హిందువులకు శుభప్రదమైన రంగుగా పరిగణిస్తారు. పవిత్రమైన సందర్భం వచ్చినప్పుడల్లా, దాదాపు ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నిస్తారు. ఈ రంగు భారతీయుల చర్మానికి బాగుంటుంది. ఏదైనా వేడుకల్లో ఈ రంగు వేసుకుంటే మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ మధ్య పసుపు రంగు దుస్తులు ధరించడం ట్రెండ్ అయింది.