Cold Coffee Shake: వేసవిలో చల్ల చల్లని కోల్డ్ కాఫీ షేక్ ఇలా చేసుకున్నారంటే నోరూరిపోతుంది
Cold Coffee Shake: మండే ఎండల్లో టీ, కాఫీలకు బదులుగా కోల్డ్ కాఫీ షేక్ తాగితే మంచిది. దీని చేయడం కూడా చాలా సులువు. కోల్డ్ కాఫీ షేక్ రెసిపీ ఎలాగో ఇక్కడ మేము ఇచ్చాము.

Cold Coffee Shake: మండే ఎండల్లో సాధారణ టీ, కాఫీలు తాగితే శరీరం డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. చల్ల చల్లని కోల్డ్ కాఫీ షేక్ ప్రయత్నించండి. దీనికోసం మీరు కాఫీ బార్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి అరగంట సమయం పడుతుంది. టేస్టులో మాత్రం అదిరిపోతోంది. కోల్డ్ కాఫీ షేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కోల్డ్ కాఫీ షేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చల్లని పాలు - రెండు కప్పులు
వేడి నీరు - రెండు స్పూన్లు
కాఫీ పొడి - ఒక స్పూను
ఐస్ క్యూబ్స్ - నాలుగు
చక్కెర - ఒక స్పూను
ఐస్ క్రీమ్ - ఒక స్పూను
కోల్డ్ కాఫీ షేక్ రెసిపీ
1. ఒక గిన్నెలో వేడి నీళ్లను వేసి, కాఫీ పొడి వేసి బాగా గిలకొట్టాలి.
2. కాఫీ పొడి మొత్తం నీళ్లలో కరిగిపోవాలి.
3. ఇప్పుడు ఒక బ్లెండర్లో ఐస్ క్యూబ్స్, నీళ్లలో కలిపిన కాఫీ మిశ్రమం, చల్లని పాలు, వెనిల్లా ఐస్‌క్రీము, పంచదార వేసి బాగా బ్లెండ్ చేయాలి.
4. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేయాలి.
5. ఆ గ్లాస్ పైన వెనిల్లా ఐస్ క్రీమ్ ఒక స్కూప్ పెట్టాలి.
6. ఆ స్కూప్ పైన చాక్లెట్ తురుమును చల్లాలి. అంతే కోల్డ్ కాఫీ షేక్ రెడీ అయినట్టే.
7. దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. పెద్దలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.
మండే ఎండల్లో వేడివేడిగా తినడం వల్ల ఇంకా శరీరం డీ హైడ్రేషన్ గురవుతుంది. దాహం కూడా తీరదు. శరీరంలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది... కాబట్టి సాధారణ కాఫీలకు బదులు ఇలా కూల్ కాఫీలను తాగడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా దాహం తీరుతుంది. ఎండల్లో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత టీ, కాఫీలకు బదులు ఇలా కోల్డ్ కాఫీ షేక్‌లు తాగితే రుచి అదిరిపోతుంది. చల్లగా, హాయిగా ఉంటుంది. ఒకసారి ఈ కోల్డ్ కాఫీ షేక్ తయారు చేసుకొని చూడండి. మీ ఇంటిల్లిపాదికి కచ్చితంగా నచ్చితీరుతుంది.
టాపిక్