Blood Cleansing: రక్తాన్ని శుభ్రపరచుకుంటేనే ఆరోగ్యం, ఇలా వారానికోసారి చేయండి చాలు
Blood Cleansing: మనం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం పరిశుభ్రంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. రక్తం మన శరీరంలో అతి ముఖ్యమైనది. ప్రతి అవయవానికి ఆక్సిజన్ తీసుకువెళుతుంది.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నాము. ఫలితంగా 30 నుంచి 40 ఏళ్లు దాటిన వెంటనే వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. మన జీవనశైలి మారుతున్న కొద్దీ మనకు వచ్చే వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతోంది. మనం వైద్యుల వద్దకు వెళ్లి మందులు వేసుకుంటాం. అవి దుష్ప్రభావాలను కలిగిస్తాయి.
కాలుష్యం వల్ల రక్తం కూడా పొల్యూట్ అవుతుంది. రక్తం కాలుష్యం వల్ల చర్మ ఇన్ఫెక్షన్ల నుండి క్యాన్సర్ల వరకు అనేక రకాల సమస్యలు వస్తాయి. జుట్టు రాలడానికి కూడా రక్త కాలుష్యం కూడా కారణం ఒకటి. రక్తంలోని వివిధ అంశాలు మన అందాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. రక్తాన్ని శుభ్రపరిచే ఆహారాన్ని తినాల్సిన అసవరం ఉంది.
కాబట్టి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా మన ఇంటి వంటగదిలో ఉండే పదార్థాలతోనే రక్తాన్ని శుభ్రపరచుకోవచ్చు. వంటగదిలో వాడే కరివేపాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తరచూ వాడడం వల్ల మన జుట్టుకు, చర్మానికి, రక్తానికి ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది మన ఆహారంలో రోజూ వాడే పదార్థం. కానీ మనం దాన్ని తినకుండా పడేస్తాం. దీని వల్ల లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకుని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇలా తినడం వల్ల శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది.
కరివేపాకులు ఇలా వాడండి
కరివేపాకులను పొడి చేసి ఇంట్లో భద్ర పరచుకోవాలి. ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూను కరివేపాకులను, ఒక అరస్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. కరివేపాకు వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ కరివేపాకు నీటితో మాత్రమే తింటే పేగుల్లోని నీటిని పీల్చుకుని పేగులు పొడిబారిపోతాయి. కాబట్టి తాగిన తర్వాత వెన్న లేదా నెయ్యి తినండి. ఈ వెన్న లేదా నెయ్యి పేగులో కరివేపాకు పీల్చిన నీటిని నిలుపుకుంటుంది.
కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో కూడా ఇది ముందుంటుంది. శరీరంలో ఉన్న బ్యాక్టిరియాను తొలగించడంలో కరివేపాకులోని గుణాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. కరివేపాకులు బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తాయి.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి అధికంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.