ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉపయోగంలో ఉంది. ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడం నుండి చల్లని ఐస్‌క్రీంను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్వాదించడం వరకు ఫ్రిడ్జ్ అనేక పనులను సులభతరం చేసింది. మీరు ప్రతిరోజూ ఫ్రిడ్జ్‌ని ఉపయోగిస్తున్నారు కానీ దాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు.
ఫ్రిడ్జ్ శుభ్రంగా లేకపోతే దానిలో ఉంచిన ఆహారం ఎంత సురక్షితంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయకుండా ఉండటం వల్ల అది కేవలం మురికిగా ఉండటడం మాత్రము కాదు.. బ్యాక్టీరియా, ఫంగస్, దుర్వాసనకు నిలయంగా మారవచ్చు. దీనివల్ల ఆహారం త్వరగా పాడవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్ ను ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌ని ఎన్నిసార్లు ఫ్రిడ్జ్‌ని శుభ్రం చేయాలో, మెరుగ్గా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం రండి.
ఫ్రిడ్జ్‌లోని కొన్ని భాగాలను ప్రతిరోజూ శుభ్రం చేయడం అవసరం. ఉదాహరణకు ఫ్రిడ్జ్ హ్యాండిల్. మనం ప్రతిరోజూ చాలాసార్లు చేతులతో దాన్ని తాకుతాం కాబట్టి దానిపై బ్యాక్టీరియా పేరుకుపోవచ్చు. అందువల్ల వంటగదిని శుభ్రం చేసేటప్పుడు ఫ్రిడ్జ్ హ్యాండిల్‌ను కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నించాలి. అదనంగా ఫ్రిడ్జ్ బయటి పొరపై తరచుగా దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. కాబట్టి దాన్ని క్రమం తప్పకుండా తడిబట్టతో తుడవండి. అంతేకాదు ఫ్రిడ్జ్‌లో ఏదైనా ఆహార పదార్థం వంటిది పడితే దాన్ని వెంటనే శుభ్రం చేయండి. లేకుంటే ఫ్రిడ్జ్ లోపల బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఫ్రిడ్జ్ డోర్ హ్యాండిల్స్, లోపలి ట్రేలు, కూరగాయల బుట్ట మొదలైనవి త్వరగా మురికి పేరుకుపోయే ప్రదేశాలు. వీటిని వారానికి ఒకసారి తడిబట్టతో, బేకింగ్ సోడా లేదా వెనిగర్‌తో శుభ్రం చేయండి. కూరగాయల బుట్టను పూర్తిగా ఖాళీ చేసి, బాగా కడిగి, ఆపై పొడి బట్టతో తుడవండి. ఆ తర్వాత మాత్రమే దానిలో కూరగాయలను మళ్ళీ నిల్వ చేయండి.
నెలకు కనీసం ఒకసారైనా ఫ్రిడ్జ్‌ని బాగా శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్‌ని డీప్ క్లీనింగ్ చేయడానికి ముందుగా ప్లగ్‌ను తీసివేయండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌ను పూర్తిగా ఖాళీ చేసి, ఆపై ఒక్కో భాగాన్ని విడిగా తీసి బాగా శుభ్రం చేయండి. దాని షెల్ఫ్‌లు, బుట్టలు, డ్రాయర్‌లను బయటకు తీసి కడిగి, ఆరబెట్టి, మళ్ళీ ఆహార పదార్థాలు, కూరగాయలను అమర్చండి.
మీ ఫ్రిడ్జ్ శుభ్రంగా, చక్కగా ఉండాలని మీరు కోరుకుంటే కొన్ని చిన్న విషయాలపై శ్రద్ధ వహించడం అవసరం. ఉదాహరణకు ఫ్రిడ్జ్‌లో ఆహారాన్ని ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచండి. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయడానికి ఎయిర్‌టైట్ కంటైనర్‌లను ఉపయోగించండి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన ఏదైనా వస్తువు పాడైపోతే దానిని వెంటనే బయటకు తీయండి. ప్రమాదవశాత్తూ ఏదైనా ద్రవం పడితే వెంటనే శుభ్రం చేయండి. మీకు మాన్యువల్ ఫ్రిడ్జ్ ఉంటే దాన్ని క్రమం తప్పకుండా డీఫ్రాస్ట్ చేయండి. అదనంగా, దుర్వాసనను నివారించడానికి మీరు ఫ్రిడ్జ్ లోపల కొద్దిగా బేకింగ్ సోడాను ఉంచవచ్చు.