వంటగదిలోని ముఖ్యమైన వస్తువుల్లో సింక్ ప్రధానమైనది. వంట చేసేటప్పుడు ఆహారపదార్థాలను కడగటం నుంచీ వంట సామాగ్రిని శుభ్రం చేయడం వరకూ, తినేసిన, తాగేసిన పాత్రలను శుభ్రం చేయడం నుంచి చేతులను శుభ్రం చేసుకోవడం వరకూ అన్నింటికీ సింక్ కావాల్సిందే. ముఖ్యంగా ప్రస్తుతం వంటతో పాటు ఆఫీసులకు వెళ్లే వారికి వంటపని త్వరగా అవడం కోసం సింక్ చాలా అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే వంటగదిలో సింక్ లేనదే వంట చేసేవారికి చెయ్యి విరిగినట్టే అవుతుంది.
కానీ ఎంత జాగ్రత్తగా ఉన్న సింక్ నాళాలు తరచూ మూసుకుపోతుంటాయి. ఇందులో నుంచి చాలా సార్లు బొద్దంకలు వంటి క్రీములు బయటకు వస్తుంటాయి. అలాగే ఆహారపు పదార్థాల కారణంగా సింక్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటే వెంటనే జాగ్రత్త పడండి. కిచెన్‌లో ఉండే సింక్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే సింక్ ప్రభావం కచ్చితంగా వంటగది మీద, అక్కడ ఉండే ఆహర పదార్థాల మీద పడుతుంది. ఇది మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి హాని తలపెట్టే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్త పడండి. కిచెన్ సింక్ బ్లాకేజ్‌ని నిర్లక్ష్యం చేయకండి.
సింక్ బ్లాకేజ్ సమస్యకు పరిష్కరించాలంటే ముందు దానికి కారణాలను కనుగొనండి. సాధారణంగా వంటకు ఉపయోగించిన పాత్రలు, తినేసిన, తాగేసిన వాటిని సింక్‌లో వేసినప్పుడు వాటిలో కొన్ని ఆహార కణాలు మిగిలిపోయి ఉంటాయి. అవి సింక్ నాళాలోకి వెళ్లి అక్కడే పేరుకుపోతాయి. ఇది సింక్ నుంచి దుర్వాసకు బ్లాకేజీకి ముఖ్యమైన కారణం అవుతుంది.
కిచెన్ సింక్‌లో నుంచి బొద్దింకలు రావడానికి కారణం పాత్రల్లోని ఆహార కణాలన్నీ నాళాల్లోకి చేరి కొవ్వులా మారి పేరుకుపోవడమే. వీటి నుంచి వచ్చే దుర్వాసనకు, ఆ కొవ్వును తినేందుకు బొద్దింకలు రావడం మొదలవుతుంది. ఇది కూడా బ్లాకేజీకి కారణం అవుతుంది. ఈ బొద్దింకలు సింక్ నుంచి మొత్తం వంట గది అంతా వ్యాపించి ఆహార పదార్థాలపై, వంట సామాగ్రిపై పాకడం చేస్తాయి. ఇది దీర్ఘకాలికంగా అనేక రకాల వ్యాధులకు కారణం అవుతుంది.
సింక్ బ్లాక్ అవడం అనేది అందరి ఇళ్లలో జరిగేదే. ఇది సాధారణమే కానీ మీరు దీన్ని నిర్లక్ష్యం చేయండి. ప్రతి రోజూ ఒక పని చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీరు మీ సింక్ ని శుభ్రంగా, సువాసన భరింతంగా మార్చుకోవచ్చు. అదేంటంటే..
ఒక వేళ మీ సింక్ శుభ్రంగానే ఉంటే వారానికి ఒకసారి ఇలా చేశాకంటే సింక్ బ్లాకెజ్ ని, బొద్దింకల సమస్యను అరికట్టవచ్చు.
మరో చిట్కా: మంచి సువాసన కోసం రాత్రి పడుకునే ముందు పాత్రలన్నీ కడిగేసుకుని సింక్‌ను శుభ్రం చేసుకోండి. తర్వాత ఒక కర్పూరం బిల్లను తీసుకుని చేత్తో నలిపి ఆ పొడిని సింక్ నాళా దగ్గర చల్లండి. ఇలా చేశారంటే రాత్రంతా మీ సింక్ లో నుంచి బ్యాక్టీరియా, బొద్దింకలు వంటివి వంట సామాగ్రి, ఆహార పదార్థాల దగ్గరకు రాకుండా ఉంటాయి.
ముఖ్యమైన చిట్కా: సింక్ బ్లాకేజీని అరకట్టాలంటే దాని పక్కనే చిన్న డస్ట్ బిన్ పెట్టండి. పాత్రలను నేరుగా సింక్ లో పడేయకుండా అందులోని ఆహారపు వ్యర్థాలను చెత్త డబ్బాలో వేయడం అలావాటు చేసుకోండి. ఇది మీ ఆరోగ్యాన్నికాపాడే, శ్రమను తగ్గించే మంచి అలవాటు.
సంబంధిత కథనం