Clay Pot: ఫ్రిడ్జ్ కన్నా మట్టికుండే నయం, వేసవికాలంలో మట్టి కుండలోని నీటిని తాగితే ఎంతో ఆరోగ్యం
Clay Pot: ఫ్రిడ్జ్ వచ్చాక మట్టికుండలని వాడే వారి సంఖ్య తగ్గిపోయింది. నిజానికి మట్టి కుండలోని నీళ్లు తాగడం వల్లే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
Clay Pot: వేసవి నెలలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫ్రిజ్లో పెట్టిన నీటిని తాగే వారి సంఖ్య అధికంగా ఉంది. వేసవిలో చల్లని నీటిని తాగితేనే దాహం తీరేది. దాహార్తిని తీర్చుకోవడానికి ఫ్రిజ్‌లో పెట్టిన నీరు మాత్రమే కాదు. మట్టికుండలో నీరు తాగినా చాలు, నిజం చెప్పాలంటే ఫ్రిజ్ కన్నా మట్టి కుండలో వేసిన నీటిని తాగడమే ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. ఫ్రిజ్ ఉన్నవారు కూడా మట్టికుండను ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
మట్టికుండలో నీరు ఎందుకు తాగాలి?
మట్టి కుండలకు సహజంగానే శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో నిలువ చేసిన నీటి ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ కుండలను బంకమట్టితో తయారుచేస్తారు. వాటికి పోరస్ స్వభావం ఉంటుంది. అంటే భాష్పీభవనాన్ని అనుమతిస్తుంది. దీనివల్ల నీరు సహజంగానే వాతావరణంలోని ఉష్ణోగ్రత కన్నా చాలా తక్కువగా ఉంటుంది. ఆ నీరు చాలా తాజాగా ఉంటుంది. కాబట్టి మట్టి కుండలోని నీటిని తాగితే దాహం త్వరగా తీరుతుంది.
మట్టి కుండల్లో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మట్టిలో ఉన్న ఖనిజాలు కలుస్తాయి. ఈ ఖనిజాలు కాస్త ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. ఆ మట్టిదనంలోని రుచి నీటికి అంటుతుంది. ఆ నీటిని తాగితే చాలా టేస్టీగా తాజాగా అనిపిస్తాయి. మట్టికుండకు పోరస్ స్వభావం ఉంటుంది. కాబట్టి అది ఉపరితలంపై గాలి ప్రసరణను అనుమతిస్తుంది. అంటే నీరు ఒకే చోట నిలిచిపోకుండా మట్టికుండ మొత్తం ఆ తాజాదనం పాకుతుంది.
మట్టి కుండలోని నీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు విడుదలవుతాయి. అవి నీటిని ఆల్కలైజ్ చేసే ప్రత్యేకమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆల్కలైన్ నీటిలో ఆమ్లతను తటస్థం చేస్తుంది. దీనివల్ల ఆ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మట్టి కుండలో నీరు ఆరోగ్యకరమైన PH సమతుల్యతను కలిగి ఉంటాయి.
ప్లాస్టిక్ లేదా ఇతర లోహపు పాత్రల్లాగా మట్టి కుండలు హానికరమైన రసాయనాలను లేదా కలుషితాలను నీటిలోకి విడుదల చేయవు. కాబట్టి నీరు చెక్కుచెదరకుండా అలానే ఉంటుంది. అవసరమైన పోషకాలు, ఖనిజాలు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి. మట్టి కుండలలో వేసిన నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడవు.
నీటి నిల్వ కోసం మట్టి కుండలను ఎంచుకోవడం చాలా అవసరం. ప్లాస్టిక్ సీసాలు వంటి వాటిలో తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల అన్నీ నష్టాలే. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టికుండలను వినియోగించడం మొదలుపెట్టాలి.
మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా సాగుతుంది. జీర్ణాశయంతర వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అజీర్ణం, గుండెల్లో మంట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. నిజానికి మట్టికుండల్లోనే నీరు తాగడం అనేది మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. పూర్వం నుంచి మట్టి కుండలో నీరు తాగడమే ఆనవాయితీగా వస్తోంది.
టాపిక్