Churumuri Recipe । కరకరలాడే చురుమురి.. సాయంత్రం వేళ టైంపాస్ చిరుతిండి!
Churumuri Snacks Recipe: చురుమురిఅనేది ఒక సాధారణ చిరుతిండి, ఇది ఆరోగ్యకరమైనది కూడా. ఈ చిరుతిండిని క్షణాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఎలా చేయాలో కింద సూచనలు చదవండి.
Tea Time Snacks Recipes: సాయంత్రం వేళ స్నాక్స్ తినాలనిపించినపుడు, ఏదో శ్రమతో కూడిన వంటకం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సింపుల్ చిరుతిళ్ళు కూడా మనసుకు తృప్తిని ఇస్తాయి. ఈ జాబితాలో చురుమురి కూడా ఒకటి. చురుమురి అంటే మసాలా మిక్స్ చేసిన మరమరాళ్లు అని అర్థం. మీరు కూడా చాలా సార్లు మరమరాళ్లు లేదా ప్యాలాలతో కేవలం కొద్దిగా కారం, కొన్ని ఉల్లిపాయలు కలుపుకొని తిని ఉంటారు. ఈ సులభమైన రెసిపీని కూడా మీరు చాలా ఇష్టపడే వారు. ఇప్పుడు ఈ చురుమురి రెసిపీ కూడా అలాంటిదే.
ట్రెండింగ్ వార్తలు
చురుమురి (churumuri) అనేది ఒక సాధారణ చిరుతిండి, ఈ రెసిపీని మరమరాళ్లతో కొన్ని సాధారణ పదార్థాలు కలిపి చేస్తారు.ఇది కొద్దిగా కారంగా, పులుపు, వగరుగా ఉంటుంది. సాయంత్రం వేళ టైంపాస్ రెసిపీగా ఉంటుంది. ఈ చిరుతిండిని క్షణాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. ఎలా చేయాలో కింద సూచనలు చదవండి.
Puffed Rice Snacks Recipe కోసం కావలసినవి
- 3 కప్పులు మరమరాళ్లు
- 1 ఉల్లిపాయ సన్నగా తరిగినది
- 1 టొమాటో సన్నగా తరిగినది
- 1 పచ్చిమిర్చి
- ½ టీస్పూన్ కారం పొడి
- 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు సన్నగా తరిగిన
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
- 3 టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశనగ
- 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి
- ¼ టీస్పూన్ జీలకర్ర
చురుమురిని ఎలా తయారు చేయాలి
- ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మరమరాళ్లు తీసుకోండి.
- అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ముక్కలు, టమోటాలు వేయండి.
- ఆపైన కొద్దిగా నూనె లేదా నెయ్యి చల్లండి.
- తర్వాత ఉప్పు, కారం, నిమ్మరసం చల్లుకోండి.
- పైనుంచి కొత్తిమీర తరుగు, వేయించిన వేరుశనగలు వేయాలి, కరకరలాడేందుకు కొద్దిగా బూందీ కూడా చల్లుకోవచ్చు.
- అన్నింటిని బాగా కలిపేస్తే చురుమురి రెడీ.
హాయిగా తింటూ ఆస్వాదించండి, ఒక గ్లాస్ టీ లేదా కాఫీని సిప్ చేయండి.
సంబంధిత కథనం