Spicy Paneer Recipe: టేస్టీ స్పైసీ చిల్లీ గార్లిక్ పనీర్, ఈ రెసిపీని చూస్తేనే నోరూరిపోతుంది-chilli garlic paneer recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Paneer Recipe: టేస్టీ స్పైసీ చిల్లీ గార్లిక్ పనీర్, ఈ రెసిపీని చూస్తేనే నోరూరిపోతుంది

Spicy Paneer Recipe: టేస్టీ స్పైసీ చిల్లీ గార్లిక్ పనీర్, ఈ రెసిపీని చూస్తేనే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu

Spicy Paneer Recipe: ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటేనే ఈ కాలంలో అన్ని విధాలా మంచిది. స్నాక్స్ గా ఈ చిల్లీ గార్లిక్ పనీర్ రెసిపీని ప్రయత్నించండి. దీన్ని చేయడం చాలా సులువు.

చిల్లీ గార్లిక్ పనీర్

Spicy Paneer Recipe: పనితో చేసిన వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పనీర్ లో పాలల్లో ఉన్న పోషకాలు అన్నీ ఉంటాయి. కాబట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు పనీర్ రెసిపీలను తినడం చాలా ముఖ్యం. శాఖాహారులు పనీర్ తినడం వల్ల కావాల్సినంత ప్రోటీన్, క్యాల్షియంను పొందవచ్చు. ఇక్కడ మేము చిల్లీ గార్లిక్ పనీర్ రెసిపీ ఇచ్చాము. ఇది స్నాక్స్ గా చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది.

చిల్లీ గార్లిక్ పనీర్ రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ - 200 గ్రాములు

పచ్చిమిర్చి - రెండు

వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

కసూరి మేథి - ఒక స్పూను

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

పెరుగు - అరకప్పు

గరం మసాలా - అర స్పూను

కారం - ఒక స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

నిమ్మరసం - రెండు స్పూన్లు

చిల్లీ గార్లిక్ పనీర్ రెసిపీ

1. ఒక గిన్నెలో పెరుగు, నిమ్మరసం, వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

2. అలాగే పనీర్ ముక్కలను కూడా వేసి వాటికి ఈ మిశ్రమాన్ని పట్టించి పావుగంటసేపు పక్కన పెట్టాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి.

4. సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. చిన్న మంట మీద దీన్ని వండాలి.

5. ముందుగా మ్యారినేట్ చేసుకున్న పనీర్ ముక్కలను ఒక్కొక్కటిగా కళాయిలో వేసి వేయించాలి.

6. అన్నింటినీ కళాయిలో వేసాక పైన మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి.

7. అవి పూర్తిగా ఉడికే వరకు చూసుకోవాలి. తర్వాత మూత తీసి ఈ పనీర్‌ను వేయించాలి.

8. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకుంటే టేస్టీ చిల్లీ గార్లిక్ పనీర్ రెసిపీ రెడీ అయినట్టే.

9. ఇది చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినవచ్చు.

రెసిపీలో కావాలంటే కాస్త మసాలా దినుసులను అధికంగా వేసుకోవచ్చు. ఈ పనీర్ ముక్కలను పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. దీన్ని స్పైసీగా చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలను చల్లుకొని తింటూ ఉంటే రుచి అదిరిపోతుంది. పిల్లల కోసం సాయంత్రం పూట తినే స్నాక్ గా పెడితే బాగుంటుంది. పనీర్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ స్నాక్ రెసిపీని వారానికి ఒకటి రెండు సార్లు పిల్లలకు తినిపించవచ్చు.