Chicken Sambar: చికెన్ సాంబార్ ఒక్కసారి చేసుకుని చూడండి, అన్నం దోశ ఇడ్లీల్లోకి అదిరిపోతుంది-chicken sambar recipe in telugu know how to make this chicken dish ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Sambar: చికెన్ సాంబార్ ఒక్కసారి చేసుకుని చూడండి, అన్నం దోశ ఇడ్లీల్లోకి అదిరిపోతుంది

Chicken Sambar: చికెన్ సాంబార్ ఒక్కసారి చేసుకుని చూడండి, అన్నం దోశ ఇడ్లీల్లోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Jan 06, 2025 11:33 AM IST

Chicken Sambar: చికెన్ వేపుడు, చికెన్ కూర వంటివే కాదు చికెన్ సాంబార్ రెసిపీని ప్రయత్నించండి. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడుఈ వంటకాన్ని ప్రయత్నించండి. ఈ చికెన్ సాంబార్ రోటీ, దోశ, ఇడ్లీ, అన్నం తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి.

చికెన్ సాంబార్ రెసిపీ
చికెన్ సాంబార్ రెసిపీ

ఆదివారాల్లో మాంసాహారుల ఇళ్లకు చికెన్, మటన్ వాసన వస్తుంది.ప్రతి ఒక్కరూ రకరకాల వంటకాలు తయారుచేస్తారు.మీరు చికెన్ ప్రియులైతే ఈ చికెన్ సాంబార్ ను అప్పుడప్పుడు ట్రై చేయండి.కొబ్బరి పాలతో చేసిన ఈ చికెన్ సాంబార్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చి ఈ వంటకాన్ని తయారుచేస్తే వారు మీ చేతుల రుచిని ఇష్టపడతారు.రోటీ, దోశ, ఇడ్లీ, రైస్ తో పాటు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది.ఈ చికెన్ సాంబార్ రిసిపిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

yearly horoscope entry point

చికెన్ సాంబార్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - అరకిలో

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

జీడిపప్పు - నాలుగు

గసగసాలు - అర స్పూన్

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొబ్బరి పాలు - ఒక కప్పు

నీరు - అర గ్లాసు

నెయ్యి - ఒక స్పూను

నూనె - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

గసగసాలు - అర స్పూను

సోంపు గింజలు - అర స్పూను

ఉల్లిపాయలు - ఒకటి

అల్లం వెల్లుల్లి - ఒక స్పూను

చింతపండు - ఒక నిమ్మరసం

టోమాటోలు - రెండు

చికెన్ సాంబార్ రెసిపీ

  1. చికెన్ సాంబార్ చేయడానికి చికెన్ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి.
  2. ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసి ఉప్పు, కారం, పసుపు వేసి అరగంట పాటూ పక్కన పెట్టి మారినేట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు సాంబార్ మసాలా తయారు చేసుకోవాలి.
  4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో జీలకర్ర, ధనియాలు, గసగసాలు, మెంతులు, సోంపు గింజలు వేసి వేయించాలి,
  5. తరువాత గుప్పెడు కరివేపాకులు, జీడిపప్పులు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
  6. అన్నీ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి , అరస్పూను పసుపు వేసి మెత్తగా రుబ్బాలి.
  7. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
  8. ఒక గిన్నెలో నీళ్లు, చింతపండు వేసి నానబెట్టాలి.
  9. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాల తరుగు వేసి బాగా కలపాలి.
  10. తరువాత కరివేపాకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. అందులో ముందుగా మారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలపాలి.
  11. చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
  12. మసాలా బాగా మరిగిన తర్వాత కొబ్బరిపాలు వేసి మళ్లీ మరిగించాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
  13. సాంబారులా చేసేందుకు రెండు గ్లాసుల నీటిని వేసి బాగా మరిగించాలి.
  14. తర్వాత తరిగిన కొత్తిమీర ఆకులు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ చికెన్ సాంబార్ రెడీ అయినట్టే.

చికెన్ సాంబారును రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీ, అన్నంతో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి అతిథులు ఎవరైనా ఉన్నప్పుడు ఈ రకమైన చికెన్ సాంబారు ప్రయత్నించండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

ఇది కూడా చదవండి: ఇంట్లో హోటల్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్; ఇది పర్ఫెక్ట్ వింటర్ స్నాక్

Whats_app_banner