Chicken Rasam: ఓసారి స్పైసీగా ఇలా చికెన్ రసం పెట్టుకుని చూడండి, వైట్ రైస్‌లో యమ్మీగా ఉంటుంది
Chicken Rasam: చింతపండు రసం, టమాటో రసం లాగే చికెన్ రసం కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చాలా సులువు. దీనిలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

Chicken Rasam: ఎన్ని కూరలు ఉన్నా, పక్కన సాంబార్ కానీ రసం కానీ కొంతమందికి ఉండాల్సిందే. అలాంటి వారు ఒకసారి చికెన్ పోలిస్తే దీనిలో పోషకాలు ఎక్కువ. రుచిగా కూడా ఉంటుంది. కాస్త స్పైసీగా చేసుకుంటే తెల్లన్నంలో కలుపుకుని తినేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని సూప్ లాగా తాగేయవచ్చు. ఇందులో ఉండే పోషకాలు పిల్లలకు, పెద్దలకు ఎంతో మేలు చేస్తాయి. చికెన్ రసం చేయడం చాలా సులువు.
చికెన్ రసం రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ ముక్కలు - ఒక కప్పు
నిమ్మరసం - ఒక స్పూను
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - మూడు
అల్లం - చిన్న ముక్క
లవంగాలు - రెండు
ఏలకులు - రెండు
నెయ్యి - రెండు స్పూన్లు
పసుపు పొడి - అర స్పూను
కారం - ఒక స్పూను
గసగసాలు - అర స్పూను
చికెన్ రసం రెసిపీ
1. చికెన్ ముక్కలను ముందుగానే మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
2. పసుపు, ఉప్పు వేసి ఉడికించుకుంటే మంచిది.
3. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, లవంగాలు, యాలకులు, గసగసాలు, పసుపు, కారం, కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
6. నెయ్యి వేడెక్కాక రుబ్బి పెట్టుకున్న మసాలాను వేసి పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద వేయించాలి.
7. దాదాపు 5 నిమిషాల పాటు వేయించాల్సి వస్తుంది.
8. ఆ తర్వాత ఒక లీటర్ నీటిని వేయాలి.
9. ఆ నీరు మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి చిన్న మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించాలి.
10. పైన కొత్తిమీర చల్లుకుని బాగా కలపాలి. అంతే చికెన్ రసం రెడీ అయినట్టే.
11. దీన్ని ఒకసారి చేసుకుంటే రెండు నుంచి మూడు రోజులు పాటు నిల్వ ఉంటుంది.
12. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సూప్ లాగా తాగేయవచ్చు.
చికెన్ రసం పిల్లలకు, పెద్దలకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. చికెన్ ఉడికించిన నీళ్లను పడేయకుండా వాటిని రసంలోనే కలిపేస్తే మంచిది. ఎందుకంటే వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇలా చికెన్ రూపంలో తినడం వల్ల కొవ్వు శరీరంలో చేరదు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం పదార్థాలను వేసాము. కాబట్టి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాల మేలే జరుగుతుంది.
టాపిక్