Chicken Pakoda: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడీ ఇలా చేసేయండి, న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ ఇది
Chicken Pakoda: కొత్త ఏడాదికి స్పెషల్‌గా ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లోనే కరకరలాడే చికెన్ పకోడీ చేయండి. రెసిపీ కూడా చాలా సులువు.
పకోడీ పేరు చెబితేనే ఎంతోమందికి తినాలన్నా కోరిక పుడుతుంది. ఇక్కడ మేము ఆయిల్ పీల్చకుండా చికెన్ పకోడీ ఎలా చేయాలో చెప్పాము. దీన్ని న్యూ ఇయర్ స్పెషల్ గా చేసుకుంటే ఇంటిల్లిపాది హ్యాపీగా తినవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చికెన్ పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ ముక్కలు - అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - అర స్పూను
పసుపు - పావు స్పూను
గరం మసాలా - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నిమ్మరసం - ఒక స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
కరివేపాకు తరుగు - గుప్పెడు
బియ్యం పిండి - రెండు స్పూన్లు
చికెన్ పకోడీ రెసిపీ
1. చికెన్ ముక్కలను పకోడీ ముక్కలు మీకు ఏ పరిమాణంలో కావాలో అంత చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకోండి.
2. ఒక గిన్నెలో చికెన్ ముక్కలను వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, ఒక స్పూను నూనె వేసి బాగా కలుపుకోవాలి.
3. అందులోనే కరివేపాకులు, కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలపాలి.
4. పచ్చిమిర్చిని నిలువుగా తరిగి అందులోనే వేసి బాగా కలిపి రెండు స్పూన్ల నీళ్లు కూడా వేయాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
7. అందులో ఈ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేగే వరకు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
8. అంతే టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయినట్టే. దీన్ని తింటే ఎవరికైనా నోరూరిపోతుంది.
మీకు స్పైసీగా కావాలనిపిస్తే మరి కొంచెం ఎక్కువ కారాన్ని వేసుకుంటే చాలు. న్యూ ఇయర్‌కి ఏ రెసిపీ ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చికెన్ పకోడీ చేసి చూడండి. మీకు ఎంతో నచ్చడం ఖాయం. మీకే కాదు మీ ఇంటిల్లిపాదికి కూడా ఇది నచ్చుతుంది.