Chicken Kebabs: చికెన్ కీమాతో ఇంట్లోనే ఇలా కబాబ్స్ చేసి చూడండి, ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం-chicken kebabs recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Kebabs: చికెన్ కీమాతో ఇంట్లోనే ఇలా కబాబ్స్ చేసి చూడండి, ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం

Chicken Kebabs: చికెన్ కీమాతో ఇంట్లోనే ఇలా కబాబ్స్ చేసి చూడండి, ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం

Haritha Chappa HT Telugu
Published May 31, 2024 03:30 PM IST

Chicken Kebabs: పుల్లలకు గుచ్చి పెట్టే కబాబ్స్‌ను ఎక్కువమంది తినడానికి ఇష్టపడతారు. కానీ వాటి కోసం రెస్టారెంట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

చికెన్ కబాబ్స్ రెసిపీ
చికెన్ కబాబ్స్ రెసిపీ

Chicken Kebabs: చికెన్ కబాబ్ స్టిక్స్ ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయి. వాటిని ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లోనే చికెన్ కబాబ్స్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు. ఇది ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వీటిని విడివిడిగా తింటే రుచి అదిరిపోతుంది. సాయంత్రం వేళ స్నాక్స్ గా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది.

చికెన్ కబాబ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ కీమా - పావు కిలో

ఉల్లిపాయ - ఒకటి

కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

మిరియాల పొడి - అర స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

నూనె - సరిపడినంత

సెనగపిండి - రెండు స్పూన్లు

కోడిగుడ్డులోని పచ్చ సొన - ఒకటి

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

జీడిపప్పు పేస్టు - ఒక స్పూను

ఆమ్చూర్ పొడి - అర స్పూను

చికెన్ కబాబ్ రెసిపీ

1. ఒక గిన్నెలో చికెన్ కీమాను వేసి శుభ్రంగా కడిగి నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి.

2. ఆ మిశ్రమంలోనే అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలపాలి.

3. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్టులా చేసి చికెన్ కీమాలో కలుపుకోవాలి.

4. ఆ తర్వాత మిరియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, జీడిపప్పు పేస్టు, ఒక స్పూను నూనె వేసి బాగా కలపాలి.

5. ఆ తర్వాత సెనగపిండిని వేసి కలుపుకోవాలి.

6. కోడిగుడ్డులోని పచ్చని సొన కూడా వేసి బాగా కలపాలి.

7. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. దీన్ని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

8. ఒక గంట పాటు అలా వదిలేయాలి. అది గట్టిపడుతుంది. ఒక గంట తర్వాత తీసుకోవాలి.

9. స్టిక్స్ కు చికెన్ కీమా పేస్టును కబాబ్స్ లాగా గుచ్చుకోవాలి.

10. స్టవ్ మీద గ్రిల్ పెట్టి అన్ని వైపులా తిప్పుతూ ఈ చికెన్ కీమా ఉడికేలా చూసుకోవాలి.

11. చిన్న మంట మీద వీటిని వేయించాలి. లేకుంటే నల్లగా మాడిపోయే అవకాశం ఉంది.

12. ఇలా అన్నీ వేయించాక తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి.

13. అందులోనే ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లుకొని వాటిని తింటే అదిరిపోతుంది. ఒక్కసారి తిని చూడండి.

చికెన్ కీమాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎప్పుడూ చికెన్ కూర, చికెన్ బిర్యాని తిని బోర్ కొడితే ఒకసారి ఇంట్లో ఇలా చికెన్ కీమాతో కబాబ్స్ చేసుకుని చూడండి. ఇవి కూడా పిల్లలకు బాగా నచ్చుతాయి. తినడం మొదలుపెట్టారంటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇందులో మనం ఆరోగ్యానికి మేలు చేసే అన్ని పదార్థాలను వేసాము, కాబట్టి అప్పుడప్పుడు వీటిని తినడం వల్ల అన్ని విధాలుగా మంచిదేనా.

Whats_app_banner