White Teeth : ఈ మూడు ఆకులు నమిలితే.. మీ దంతాలు తెల్లగా మెరిసిపోతాయి-chewing these 3 leaves that keep your teeth white and healthy details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  White Teeth : ఈ మూడు ఆకులు నమిలితే.. మీ దంతాలు తెల్లగా మెరిసిపోతాయి

White Teeth : ఈ మూడు ఆకులు నమిలితే.. మీ దంతాలు తెల్లగా మెరిసిపోతాయి

Anand Sai HT Telugu
Nov 14, 2023 09:59 AM IST

White and Healthy Teeth : దంతాలు తెల్లగా చేసేందుకు చాలా కష్టపడుతుంటారు కొందరు. కొందరికి పసుపు దంతాలు ఉంటాయి. మరికొంతమందికి మరకలు అవుతాయి. అయితే వీటిని తెల్లగా చేసేందుకు సింపుల్ చిట్కాలు ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

పళ్లను చూసి మన ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దంత సమస్యలతో(Teeth Problems) బాధపడేవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. వారికి నవ్వడం, మాట్లాడడం సరిగా రాదు.. దీనికి కారణం.. నవ్వితే నా పళ్లు చూసి ఏమనుకుంటారోనని భయం.

టూత్ బ్రషింగ్ సరిగా లేకపోవడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, వృద్ధాప్యం వల్ల దంతాల రంగు మారిపోతుంది. కానీ వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల దంతాల నుండి రక్తస్రావం, నోటి దుర్వాసన(Mouth Bad Smell), బలహీనమైన దంతాలు మొదలైన ఇబ్బందులు ఎదురవుతాయి. మన ఇంట్లో ఉండే కొన్ని మొక్కల ఆకులను నమలడం వల్ల దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా మెరుస్తాయి. ఆ ఆకులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు పళ్లను తిరిగి తెల్లగా మార్చడంలో వేప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేప ఆకుల్లో(Neem Leaves) యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి దంతాలపై ఉండే బ్యాక్టీరియాను చంపి దంతాలను తెల్లగా చేస్తాయి. వేప ఆకులతో చేసిన టూత్‌పేస్ట్(Neem Toothpaste) కూడా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. పళ్లు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.

తులసి ఆకుల్లో(Tulsi Leaves) గొప్ప ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో తులసి మొక్కను తప్పక ఉంచుతారు. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకుల రసంతో మౌత్ వాష్, ఆకులను నమలడం వల్ల దంతాల నుండి ఫలకం, బ్యాక్టీరియా తొలగిపోయి తెల్లగా మారుతాయి. నోటి దుర్వాసన ఉండదు. పళ్లకు కూడా ఆరోగ్యకరం.

చింతచెట్లు ఊర్లలో చాలా ఉంటాయి. చింతలో మంచి ఔషధ గుణాలున్నాయి. చింత ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నమిలితే, ఈ ఆకు రసాన్ని మౌత్ వాష్ గా వాడితే దంతాల పసుపు రంగు పోయి, తెల్లగా మారుతాయి. అంతే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.

ఇలా కూడా ట్రై చేయెుచ్చు

తులసి ఆకులు, ఎండిన నారింజ తొక్కలతోనూ దంతాలు తెల్లగా చేసుకోవచ్చు. మీరు పేస్ట్ తయారు చేయాలి. ముందుగా 7 తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఎండిన నారింజ తొక్కను కొద్ది మొత్తంలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని నేరుగా మీ దంతాల మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి.

అంతేకాదు మరో చిట్కా కూడా ఉంది. ఒక చెంచా ఉప్పు తీసుకుని, నిమ్మరసం ఉపయోగించి ఉప్పు కలిపి మందపాటి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌తో మీ దంతాలను బ్రష్ చేయండి. తెల్లటి దంతాల కోసం ఈ హోం రెమెడీని క్రమం తప్పకుండా లేదా ప్రత్యామ్నాయంగా ప్రయత్నించవచ్చు.

WhatsApp channel