Chettinad Prawns Biryani: చెట్టినాడ్ స్టైల్‌లో రొయ్యల బిర్యానీ చేశారంటే నోరూరిపోతుంది-chettinad prawns biryani recipe in telugu know how to make rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chettinad Prawns Biryani: చెట్టినాడ్ స్టైల్‌లో రొయ్యల బిర్యానీ చేశారంటే నోరూరిపోతుంది

Chettinad Prawns Biryani: చెట్టినాడ్ స్టైల్‌లో రొయ్యల బిర్యానీ చేశారంటే నోరూరిపోతుంది

Haritha Chappa HT Telugu
Jan 29, 2025 05:30 PM IST

Chettinad Prawns Biryani: చెట్టినాడ్ స్టైల్‌లో‌ చేసే వంటకాలు చేసే మాంసాహార వంటకాలు ప్రత్యేకమైన టేస్టీగా ఉంటాయి. సాధారణ బిర్యానీ కంటే రొయ్యల బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. చెట్టినాడ్ వంటకాల్లో రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

చెట్టినాడ్ రొయ్యల బిర్యానీ రెసిపీ
చెట్టినాడ్ రొయ్యల బిర్యానీ రెసిపీ

చెట్టినాడ్ వంటకాలు తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిపోయాయి. చెట్టినాడ్ స్టైల్ లో ఎంతో రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము చెట్టినాడ్ స్టైల్లో రొయ్యల బిర్యానీ రెసిపీ ఇచ్చాము. చెట్టినాడ్ వంటకాలకు ఎప్పుడూ తనదైన అభిమానులు ఉన్నారు. ఈ చెట్టినాడ్ వంటకాల్లో మాంసాహార వంటకాలు ప్రత్యేకమైనవి. రొయ్యల బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా వండాలో తెలుసుకోండి.

చెట్టినాడ్ రొయ్య బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు

రొయ్యలు - అరకిలో

బాస్మతి రైస్ - రెండు కప్పులు

ఉల్లిపాయలు - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

టమోటాలు - మూడు

పచ్చిమిర్చి - మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

పెరుగు - పావు కప్పు

పసుపు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

బిర్యానీ ఆకు - ఒకటి

లవంగాలు - నాలుగు

యాలకులు - మూడు

అనాస పువ్వు - ఒకటి

మరాఠీ మొగ్గ - ఒకటి

నూనె - మూడు స్పూన్లు

కారం - అర స్పూను

సోంపు - అర స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

చెట్టినాడ్ రొయ్యల బిర్యానీ రెసిపీ

  1. రొయ్యలను శుభ్రం చేసి నీటిలోనే బాగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
  2. ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రం చేసిన రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సోంపు పొడి వేసి కనీసం ఒక గంట మ్యారినేట్ చేయండి.
  3. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి 20 నిమిషాలు నానబెట్టండి.
  4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
  5. నూనె వేడి అయ్యాక దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేయాలి.
  6. తరువాత యాలకులు, లవంగాలు కూడా వేయించాలి.
  7. ఇవన్నీ వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టమోటాలు వేసి బాగా వేయించాలి.
  8. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన రొయ్యలు వేసి వేయించాలి.
  9. పెరుగు, పసుపు, కారం, సోంపు వేసి వేగించుకోవాలి.
  10. ఆ తర్వాత నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి.
  11. అవి వేగాక తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి.
  12. మీడియం మంట మీద ఉండి మొత్తం ఉడికించాలి. అంతే టేస్టీ చెట్టినాడ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి మీకే తెలుస్తుంది దీని రుచి.

మటన్, చికెన్ తో పోలిస్తే రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మంచిది, రొయ్యలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో రొయ్యలు వండి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner