Chettinad Idli Podi: ఇడ్లీ దోశెల్లోకి చెట్టినాడ్ ఇడ్లీ పొడి, ఒక్కసారి చేసుకుంటే నెలరోజులు నిల్వ ఉంటుంది
Chettinad Idli Podi: ఇడ్లీ, దోశెల్లో ఎప్పుడూ చట్నీలే తింటే ఎలా? ఒకసారి చెట్టినాడ్ ఇడ్లీ పొడి చేసుకుని చూడండి. స్పైసీగా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చాలా సులువు.
Chettinad Idli Podi: ఇడ్లీ, దోశెల్లోకి చట్నీతో పాటు పక్కన స్పైసీ పొడులు ఉంటే ఆ రుచే వేరు. చెట్టినాడ్ ఇడ్లీ పొడి కాస్త కొత్తగా ఉంటుంది. ఇడ్లీలతో దోశలతోనే కాదు అన్నంతో కూడా ఇది బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. దీని చేయడం కూడా చాలా సులువు. అల్పాహారాలకు జోడీగా ఈ చెట్టినాడ్ ఇడ్లీ పొడిని రెడీ చేసి పెట్టుకోండి. దీని రెసిపీ చాలా సులువు. వేడివేడి అన్నంలో చెట్టినాడ్ పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు.
చెట్టినాడ్ పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మినప్పప్పు - అర కప్పు
శనగపప్పు - అర కప్పు
నువ్వులు - పావు కప్పు
కందిపప్పు - అర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
ఎండుమిర్చి - 15
వేరుశెనగ పలుకులు - గుప్పెడు
చెట్టినాడ్ ఇడ్లీ పొడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి కందిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, నువ్వులు విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. వాటిని చల్లార్చాలి. అలాగే కరివేపాకులను కూడా ఒకసారి వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన పప్పులన్నింటినీ వేసి ఉప్పు, కరివేపాకులు, ఎండుమిర్చి కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
4. వాటిని ఒక గాలి చొరబడని కంటైనర్లో వేసుకోవాలి.
5. అంతే చెట్టినాడ్ ఇడ్లీ పొడి రెడీ అయినట్టే. ఇడ్లీ పొడిలో కాస్త నెయ్యి వేసుకొని ఇడ్లీతో కలిపి తింటే టేస్టీగా ఉంటుంది.
6. అలాగే దోశెల పైన కూడా ఇడ్లీ పొడి చల్లుకొని తింటే రుచిగా ఉంటుంది.
7. అన్నంలో కూడా ఈ చెట్టినాడ్ ఇడ్లీ పొడి స్పైసీగా కొత్త రుచులు అందిస్తుంది.
8. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి చేసుకుంటే ఎన్నో రోజులపాటు నిల్వ ఉంటుంది.
ఇడ్లీతో ఎప్పుడూ కారంపొడి చట్నీలు తింటే కొత్తగా ఏముంటుంది. ఒకసారి చెట్టినాడ్ ఇడ్లీ పొడి చేసుకొని చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇది చేసుకున్నాక నెల నుంచి రెండు నెలల పాటు తాజాగా నిల్వ ఉంటుంది. కాబట్టి వృధా అవుతుందన్న భయం లేదు. దీన్ని అన్ని అల్పాహారాలతోనూ తినవచ్చు. ఉప్మా చేసుకున్నప్పుడు కూడా పైన చల్లుకొని తింటే స్పైసీగా టేస్టీగా ఉంటుంది.
టాపిక్