Chettinad Fish Fry: చెట్టినాడ్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై చేశారంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది, ఇలా చేసేయండి
Chettinad Fish Fry: చేపల ఫ్రై పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక చెట్టినాడ్ స్టైల్ లో ఒక క్లాసిక్ వంటకంలా చేపల ఫ్రైని చేస్తే ఆ రుచే వేరు. ఇక్కడ మేము చెట్టినాడ్ ఫిష్ ఫ్రై రెసిపీ ఇచ్చాము. ట్రై చేయండి.
ఫిష్ ఫ్రై ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది. ఇక చెట్టినాడ్ స్టైల్‌లో చేస్తే ఆ రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళనాడులోని చెట్టినాడు అనే ప్రాంతంలో పుట్టిన క్లాసిక్ ఫిష్ వంటకం ఇది. అక్కడి నుంచి ఇది విదేశాలకు కూడా చేరింది. చేపలకు ప్రత్యేకమైన రుచిని ఇవ్వడమే ఈ చెట్టినాడ్ స్టైల్ ప్రత్యేకత. దీన్ని చేయడం చాలా సులువు. చేపల ఫ్రై ను ఒకసారి ఇలా చెట్టినాడ్ స్టైల్‌లో చేసి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు - ఆరు
నూనె - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం తరుగు - ఒక స్పూను
ఎండుమిర్చి - నాలుగు
ధనియాల పొడి - ఒకటిన్నర స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
శెనగపిండి - రెండు స్పూన్లు
బియ్యప్పిండి - ఒకటిన్నర స్పూను
మెంతులు - పావు స్పూను
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై రెసిపీ
1. చేపల ముక్కలను శుభ్రంగా కడిగి ఎక్కువ నీరు లేకుండా పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాల పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
4. అందులోనే ఉప్పును కూడా వేయాలి.
5. ఆ తర్వాత బియ్యప్పిండి, శెనగపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు చేప ముక్కలకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.
7. అరగంట పాటు వీటిని ఫ్రిజ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కాస్త లోతుగా ఉండే పెనాన్ని పెట్టాలి.
9. నూనెను వేసి ఈ చేప ముక్కలను వేసి రెండు వైపులా రంగు మారేవరకు వేయించుకోవాలి.
10. చేప ముక్కలు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి.
11. ఇవి ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి.
12. వీటిని ఒక గిన్నెలో వేసి పైన కొన్ని కొత్తిమీర తరుగు, పచ్చి ఉల్లిపాయల ముక్కలను పెట్టుకుంటే తినడానికి చెట్టినాడు స్టైల్ లో ఫిష్ ఫ్రై వంటకం రెడీ అయినట్టే. ఇది చాలా బాగుంటుంది. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
తమిళనాడులోని టేస్టీ వంటకాలలో చెట్టినాడు ఫిష్ ఫ్రై ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మాంసాహారాన్ని ఇష్టపడేవారు చెట్టినాడు స్టైల్‌లో ఇలా చేపల ఫ్రై ని చేసుకుని చూడండి. ఇది కచ్చితంగా మీకు నచ్చుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మెతతులకు ఎంతో మేలు చేస్తుంది. చేపల్లో ఉండే పోషకాలు మన శరీరానికి అత్యవసరమైనవి. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. చేపల్లో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది మన శరీరాన్ని ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి దూరం చేస్తుంది. మానసిక సమస్యలను అరికట్టడంలో చేపలు ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి మానసిక సమస్యలతో బాధపడేవారు చేపలను తరుచూ తింటూ ఉండడం ఎంతో ముఖ్యం. ఎవరైతే చేపలను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటారో వాటిరి రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. అలాగే ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా వీళ్ళకి రావు.
టాపిక్