Chettinad Biryani: చెట్టినాడ్ బిర్యానీ ఇలా చేస్తే నోరూరిపోతుంది, ఒక్కసారి తింటే వదల్లేరు రెసిపీ ఇదిగో
చెట్టినాడ్ రెసిపీలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి ఎంతో స్పెషల్ కూడా. చెట్టినాడ్ స్టైల్ లో బిర్యానీ రెసిపీ ఇచ్చాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో బిర్యానీ చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది.

బిర్యానీ పేరు చెబితేనే వెంటనే తినాలన్న కోరిక మనసులో పుట్టేస్తుంది. మరోపక్క నోరూరిపోతుంది. బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ. చెట్టినాడ్ వంటకాలు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఒకటి. తమిళనాడులో అనేక ప్రసిద్ధ వంటకాలు ఉన్నాయి. వాటిలో చెట్టినాడ్ వంటకాలు కూడా భాగమే. చెట్టినాడ్ వంటకం కారైకుడి, దాని చుట్టుపక్కల ప్రసిద్ధి చెందింది. చెట్టినాడ్ వంట అందరికీ తెలియని పద్ధతి. నిజానికి చెట్టినాడ్ రెసిపీలను సులువుగా చేసేయచ్చు. ఒక్క చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ రెసిపీ ఇచ్చాము.
చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ రెసిపీకి కావల్సిన పదార్థాలు
చికెన్ - అర కిలో
ఉల్లిపాయ - రెండు
టొమాటోలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత ఉప్పు
కరివేపాకులు - గుప్పెడు
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు
దాల్చిన చెక్క - ఒక ముక్క
లవంగాలు - ఆరు
యాలకులు - నాలుగు
అనాస పువ్వు - ఒకటి
షాజీరా - అర స్పూను
జాపత్రి - రెండు ముక్కలు
పుదీనా తరుగు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పచ్చిమిరపకాయలు - నాలుగు
కారం - రెండు స్పూన్లు
గరం మసాలా - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
చెట్టినాడ్ స్టైల్ బిర్యానీ రెసిపీ
- బిర్యానీ వండడానికి ముందు పెద్ద చికెన్ ముక్కలు కట్ చేయించాలి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల ముందే నీటిలో నానబెట్టుకోవాలి.
- స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ ముక్క, అనాస పువ్వు, షాజీరా, జాపత్రి వేసి వేయించాలి.
- అందులో పుదీనా, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి.
- తరువాత పచ్చి మిర్చి, ఉల్లిపాయ, టమోటా ముక్కలను వేసి వేయించాలి.
- తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా వేయించాలి.
- అందులోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా వేయించాలి.
- ఇందులోనే చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. పైన మూత పెట్టి ఉడికించాలి.
- చికెన్ 70 శాతం ఉడికాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి, అవి ఉడకడానికి సరిపడా ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
- ఆవిరి పోకుండా పైన క్లాత్ కప్పి మూతపెట్టాలి. తరువాత్ స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే చెట్టినాడ్ స్టైల్ లో బిర్యానీ రెడీ అయినట్టే.
ఇక్కడ మేము చెప్పినట్టు చెట్టినాడ్ స్టైల్లో బిర్యానీ చేసి చూడండి ఘుమఘుమ లాడిపోతుంది. దీన్ని రైతాతో తింటే రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసిన వంటకాలు మాంసాహారులకు బాగా నచ్చుతాయి. బిర్యానీ రెసిపీ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటేనే దాని రుచి మరింతగా మీకు నచ్చుతుంది.
సంబంధిత కథనం