మీ ఛాతీలో కలిగే మంట అసౌకర్యంగా అనిపిస్తుందా.. దీని కారణంగా మీరు రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా..? లేదా నిద్ర సరిగా పట్టడం లేదా? దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. రాత్రి గుండెల్లో మంట పుట్టే ఫీలింగ్, నిద్రపోతున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి ప్రయాణించినప్పుడు ఇది జరుగుతుంది. దీనికి ఉపశమనం కోసం కొన్ని రకాల మందులు వాడొచ్చు. కానీ, గుండెల్లో మంటను నివారించడానికి అనేక సహజ మార్గాలు ఉన్నాయి.
ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మీకు అసౌకర్యాన్ని కలిగించి, మంచి నాణ్యమైన నిద్రను నిరోధిస్తుంది. మరుసటి రోజు మీకు బద్దకంగా లేదా అలసటగా ఫీలవుతుంటారు. ఈ సమస్యకు ప్రముఖ డాక్టర్ సౌరభ్ సేథీ పరిష్కారం చెబుతున్నారు. రాత్రిపూట గుండెల్లో మంట పరిస్థితిని నివారించడానికి కొన్ని సహజ మార్గాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.
"రాత్రిపూట గుండెల్లో మంటను తగ్గించుకోవడం వల్ల నిద్ర నాణ్యతను గణనీయంగా మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది" అని చెబుతున్నారు.
మీరు అనుకున్న దానికంటే నిద్ర భంగిమ చాలా ముఖ్యం. చాలా మందికి డిఫాల్ట్, నిద్ర భంగిమ ఉన్నప్పటికీ, గుండెల్లో మంటను తగ్గించడానికి ఒక సహజ మార్గం ఏంటంటే, స్పృహతో సరైన భంగిమలో పడుకోవడం. దీని కోసం మీరు ఎడమవైపుకు తిరిగి పడుకోండి.
ఇలా ఎడమవైపు నిద్రపోవడం వల్ల అన్నవాహిక క్రింద కడుపును ఉంచడం ద్వారా యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి .
సోంపు గింజలను సాధారణంగా ఉబ్బరం నుండి అజీర్ణం వరకు జీర్ణ సమస్యలకు చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఈ సమస్యకు కూడా డాక్టర్ సేథీ సోంపు గింజలను సిఫార్సు చేశారు. డాక్టర్ సేథీ మాట్లాడుతూ, సోంపు గింజలలో అనెట్హోల్ వంటి సహజ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి కడుపు ఆమ్లాన్ని తటస్థం చేయడానికి సహాయపడతాయి.
రాత్రిపూట గుండెల్లో మంట చాలా వరకు నిద్ర భంగిమ, కోణం నుండి కూడా వస్తుంది. సాధారణంగా గురుత్వాకర్షణ కారణంగా కడుపు ఆమ్లం కడుపులో ఉంటుంది. కానీ, మీరు పడుకున్నప్పుడు, అది పైకి ప్రయాణిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, అండర్ పరుపుతో శరీరాన్ని పైకి లేపండి. ఎడ్జ్ గురుత్వాకర్షణ అవరోధాన్ని సృష్టిస్తుంది. ఇది నిద్రలో కడుపు ఆమ్లం అన్నవాహికపై ప్రయాణించకుండా నిరోధిస్తుంది.
సంబంధిత కథనం