Cheesy Maggi: పిల్లల కోసం చీజీ మ్యాగీ రెసిపీ, రుచిలో అదిరిపోతుంది, చేయడం కూడా చాలా సులువు
Cheesy Maggi: పిల్లలు మ్యాగీని ఎంతో ఇష్టపడతారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి కొత్తగా చీజీ మ్యాగీ రెసిపీ ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
Cheesy Maggi: చీజ్ అనగానే నోరూరిపోతుంది. ఇక్కడ మేము చీజ్ మ్యాగీ రెసిపీ ఇచ్చాము. ఇది వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. తక్కువ సమయంలో మ్యాగీని వండేయచ్చు. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో లేదా సాయంత్రం ఆకలేసినప్పుడు చీజ్ మ్యాగీని చేసుకుని తినవచ్చు. తురిమిన చీజ్ ను దీనిలో వాడతాం. చీజ్ కాస్త ఉప్పగా ఉంటుంది. కాబట్టి మ్యాగీలో ఉప్పును తక్కువగా వేసుకోవాలి. లేకుండా సాల్ట్ అధికమై పోయే అవకాశం ఉంది.
చీజీ మ్యాగీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మ్యాగీ నూడుల్స్ - ఒక ప్యాకెట్
చీజ్ తురుము - పావు కప్పు
ఎరుపు బెల్ పెప్పర్ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
కారం - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
మ్యాగీ మసాలా - రెండు స్పూన్లు
పచ్చి బఠానీలు - గుప్పెడు
ఉప్పు - చిటికెడు
చీజీ మ్యాగీ రెసిపీ
1. బెల్ పెప్పర్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్లు, ఉప్పు వేయాలి.
3. ఆ నీళ్లలో మ్యాగీ నూడుల్స్ వేయాలి.
4. ఆ నూడుల్స్ ఉడికాక తీసి పక్కన పెట్టుకోవాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేయాలి.
6. నూనె వేడెక్కాక ముందుగా కోసుకున్న ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, బెల్ పెప్పర్స్, పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి.
7. మ్యాగీ మసాలా వేసి కలుపుకోవాలి.
8. తురిమిన చీజ్‌ను కూడా చల్లుకోవాలి.
9. ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడుల్స్ ను అందులో వేసి కలుపుకోవాలి.
10. దాన్ని వేడివేడిగా ప్లేటులో వేసుకుని సర్వ్ చేయండి.
11. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
పిల్లలకు పదినిమిషాల్లో వండి పెట్టాలనుకుంటే చీజీ మ్యాగీ చేయండి. ఇది చాలా త్వరగా రెడీ అయిపోతుంది. రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది.
టాపిక్