Egg Roast: నిమిషాల్లో రెడీ అయ్యే చీజీ ఎగ్ రోస్ట్, పిల్లలకు నచ్చే స్నాక్ ఇది
Egg Roast: కోడిగుడ్లతో చేసే వంటకాలు టేస్టీగా ఉంటాయి. గుడ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు, బ్యాచిలర్స్ కు నచ్చేలా చీజీ ఎగ్ రోస్ట్ రెసిపీ చేయవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కోడిగుడ్డుతో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో చేసే రెసిపీలు సులువుగా వండేయచ్చు. అదే సమయంలో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్ళే వారు ఈజీగా అయిపోయే వంటకాలను ఇష్టపడతారు. గుడ్లతో చాలా రకాల వంటలు త్వరగా చేయవచ్చు. గుడ్లతో ఒకసారి చీజీ ఎగ్ రోస్ట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. గుడ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్ లు కూడా ఉంటాయి. అందువల్ల, ఈ వంటకం మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ చీజీ ఎగ్ రోస్ట్ రెసిపీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది.
చీజీ ఎగ్ రోస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థలు
ఉడికించిన గుడ్డు - నాలుగు
చీజ్ - పావు కప్పు
ఎండుమిర్చి పేస్ట్ - ఒకటిన్నర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర స్పూను
కారం పొడి - అరస్పూను
పసుపు పొడి - పావు స్పూను
చాట్ మసాలా - అర స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
శెనగపిండి - ఒక స్పూను
పెరుగు - రెండు స్పూన్లు
బటర్ - ఒక స్పూను
నిమ్మ రసం - అర స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
చీజీ ఎగ్ రోస్ట్ రెసిపీ
- ఒక గిన్నెలో ఎండుమిర్చి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, శనగపిండి, పెరుగు వేసి బాగా కలపాలి.
2. కోడిగుడ్లును ఉడకబెట్టి పొట్టు తీయాలి.
3. ఉడికించిన గుడ్లపై కత్తితో నిలువుగా గాట్లు పెట్టాలి.
4. ఎండుమిర్చి మిశ్రమంలో ఈ కోడిగుడ్లను వేసి బాగా మ్యారినేట్ చేయాలి.
5. తరువత పావుగంట సేపు పక్కన పెట్టేయాలి.
6. స్టవ్ మీద నాన్ స్టిక్ గ్రిల్ పాన్ పెట్టి వేడి చేయాలి.
7. అందులో బటర్ వేసి దానిపై గుడ్లు పెట్టాలి. పైనుంచి కొద్దిగా కరిగిన బటర్ వేయండి.
8. చిన్న మంట మీద ఉండి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి.
9. గుడ్డును తిప్పి కొద్దిగా బటర్ చల్లి అవతలి వైపు 2-3 నిమిషాలు ఉడికించాలి.
10. ప్రతి గుడ్డు పైన చీజ్ ముక్క ఉంచాలి.
11. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి చీజీ ఎగ్ రోస్ట్ తీసుకోవాలి.
12. పైన నిమ్మరసం పిండి, చాట్ మసాలా చల్లాలి.
13. పైన తరిగిన కొత్తిమీర ఆకులను చల్లి, ఉల్లిపాయ రింగులు, గ్రీన్ చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.
ఇది పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇది ముఖ్యంగా బ్యాచిలర్స్ కు ఎంతో సులువుగా అయిపోతుంది.
చదవండి | ఈ ఉడిపి స్టైల్ సాంబార్ ను మీరే ట్రై చేయండి; ఒకసారి తిన్న తర్వాత, మీరు ప్రతిరోజూ తినాలనుకుంటున్నారు, ప్రయత్నించండి