Anant Ambani: అనంత్ అంబానీ పెట్టుకున్న వాచ్ చూడండి, దాని ఖరీదు ఎంతో అంచనా వేసి చెప్పండి-check out the watch worn by anant ambani it costs 22 crore rupees ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anant Ambani: అనంత్ అంబానీ పెట్టుకున్న వాచ్ చూడండి, దాని ఖరీదు ఎంతో అంచనా వేసి చెప్పండి

Anant Ambani: అనంత్ అంబానీ పెట్టుకున్న వాచ్ చూడండి, దాని ఖరీదు ఎంతో అంచనా వేసి చెప్పండి

Haritha Chappa HT Telugu
Jan 01, 2025 07:00 PM IST

Anant Ambani: అనంత్ అంబానీకి వాచ్ లంటే చాలా ఇష్టం. వీటి ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన విలువైన రిచర్డ్ మిల్లీ ఆర్ఎం 52-04 స్కల్ బ్లూ సఫైర్ గడియారాన్ని ధరించారు. ఈ అరుదైన టైమ్ పీస్ కేవలం ప్రపంచంలో మూడు మాత్రమే ఉన్నాయి.

అరుదైన వాచీని పెట్టుకున్న అనంత్ అంబానీ
అరుదైన వాచీని పెట్టుకున్న అనంత్ అంబానీ

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి వాచీలంటే చాలా ఇష్టం. ఆయన తన పెళ్లిలో కూడా కోట్ల విలువైన వాచీలను గిఫ్టులుగా అందించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల కుమారుడు అనంత్ ఒక హోరాలజిస్ట్. అంటే వాచీలను చాలా ఇష్టంతో సేకరించేవాళ్లు. ఇప్పుడు అతను పెట్టుకున్న ఒక వాచ్ ప్రపంచాన్ని ఆకర్షించింది.

yearly horoscope entry point

అనంత్ అంబానీ రిచర్డ్ మిల్లే, పాటెక్ ఫిలిప్, ఔడెమర్స్ పిగ్యూట్ వంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన వాచీలను ధరిస్తాడు. ఇటీవల రాధికా మర్చంట్ తో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు రిచర్డ్ మిల్లే ఆర్ ఎం 52-04 "స్కల్" బ్లూ సఫైర్ అనే వాచ్ ను ధరించాడు. ఇది ప్రపంచంలోని అరుదైన వాచ్ లలో ఒకటి.

అరుదైన రిచర్డ్ మిల్లె వాచ్

ప్రపంచంలోనే అరుదైన టైమ్ పీస్ లలో రిచర్డ్ మిల్లె ఆర్ ఎం 52-04 "స్కల్" బ్లూ సఫైర్ ఒకటి. ది ఇండియన్ హోరాలజీ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రకారం, ఈ వాచీ కేవలం ప్రపంచంలో మూడు పీస్ లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి అనంత్ అంబానీ దగ్గర ఉంది. వింటేజ్ గ్రెయిల్ అనే లగ్జరీ గడియార దుకాణం చెబుతున్నప్రకారం 'మీ జీవితకాలంలో వీటిని చూడటం మీ అదృష్టం' అని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వాచ్ కూడా చూసేందుకు ఎంతో అందంగా ఉంది.

రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 52-04 ఒకే నీలమణితో తయారుచేశారు. ఈ వాచ్ మధ్యలో పిరేట్ పుర్రె బొమ్మ ఉంది. ఆ బొమ్మపై క్రాస్ బోన్ల డిజైన్ ఉంటుంది. ఇండియన్ హోరాలజీ ప్రకారం, పుర్రె వెనుక భాగం, మధ్య వంతెనగా క్రాస్ బోన్లు వంటివి లోపల ఆ వాచ్ సులువుగా కదిలేలా ఉంటుంది.

అనంత్ అంబానీ వాచ్ ఖరీదు

రిచర్డ్ మిల్లె ఆర్ఎం 52-04 "స్కల్" బ్లూ సఫైర్ వాచ్ విలువ 2,625,000 డాలర్లు, అంటే సుమారు రూ .22,51,90,481 లేదా 22 కోట్ల రూపాయలు. దీని ధర తెలిస్తే ఎవరైనా నోరు తెరిచి ఆశ్యర్చపోవాల్సిందే.

అధిక ధరలతో ప్రత్యేకమైన డిజైన్లను తయారుచేసే ప్రసిద్ధి చెందిన స్విస్ వాచ్ మేకింగ్ బ్రాండ్ కంపెనీ రిచర్డ్ మిల్లె. ఇది సంపన్నుల కోసం మాత్రమే తయారు చేస్తారు. వీటిని కేవలం ఒకటి లేదా రెండు వాచ్ లను తయారుచేస్తూ ఉంటారు.

అనంత్ అంబానీ గురించి

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ. అనంత్ రాధికా మర్చంట్ ను వివాహం చేసుకున్నాడు. 2024 జూలై 12న వీరి వివాహం జరిగింది. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ ఆయన తోబుట్టువులు.

Whats_app_banner