UMANG: ఉమాంగ్ యాప్ ఉపయోగించి పీఎఫ్ నిధులు ఇలా విత్‌డ్రా చేసుకోండి
ఈపీఎఫ్ ఖాతా కలిగిన ఉద్యోగులు తమ PF ఖాతాకు సంబంధించి డిపాజిట్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు, నగదును విత్‌డ్రా చేసుకోవడానికి తీసుకోగల సులభమైన మార్గాలలో ఉమాంగ్ యాప్ ఒకటి. ఈపీఎఫ్ నిధులను పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినా లేదా రెండు నెలలకు పైబడి నిరుద్యోగిగా ఉన్నా అలాంటి సమయంలో తమ EPF బ్యాలెన్స్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.
యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్.. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఉమాంగ్(UMANG) అని పిలుస్తారు. ఈ యాప్ అనేది ఆదాయపు పన్ను దాఖలు నుంచి ఆధార్ కార్డ్, ప్రావిడెంట్ నిధులకి సంబంధించిన విచారణలు, గ్యాస్ సిలిండర్ బుకింగ్, పాస్‌పోర్ట్ సేవ సహా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ రకాల సేవలను పొందడానికి ఉపయోగించే ఒక ఆల్-ఇన్-వన్ యాప్.
పీఎఫ్ ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు..
ఈపీఎఫ్ ఖాతా కలిగిన ఉద్యోగులు తమ PF ఖాతాకు సంబంధించి డిపాజిట్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు, నగదును విత్‌డ్రా చేసుకోవడానికి తీసుకోగల సులభమైన మార్గాలలో ఉమంగ్ యాప్ ఒకటి. ఈపీఎఫ్ నిధులను పాక్షికంగా లేదా మొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినా లేదా రెండు నెలలకు పైబడి నిరుద్యోగిగా ఉన్నా అలాంటి సమయంలో తమ EPF బ్యాలెన్స్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. అలా కాకుండా వైద్యపరమైన కారణాలు, వివాహం, హోమ్ లోన్ చెల్లింపులు మొదలైన నిర్దిష్ట సందర్భాలలో కొద్ది మొత్తంలో EPF ఉపసంహరణకు అనుమతిస్తారు.
ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించి EPF డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలో దశల వారీగా కింద ఇస్తున్నాం గమనించండి.
స్టెప్1:
ఉమాంగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
స్టెప్ 2:
యాప్ ఇన్ట్సాల్ అయిన తర్వాత సెర్చ్ మెనూకి వెళ్లి EPFO కోసం చూడండి
స్టెప్ 3:
‘ఉద్యోగి సెంట్రిక్’ ఆప్షన్ ఎంచుకుని, ‘రైజ్ క్లెయిమ్’ పై క్లిక్ చేయండి
స్టెప్ 4:
ఇప్పుడు మీ EPF UAN నంబర్‌ని నమోదు చేయండి
స్టెప్ 5:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది, దానిని ఎంటర్ చేయండి
స్టెప్ 6:
ఇప్పుడు ఉపసంహరణ రకాన్ని (టైప్ ఆఫ్ విత్‌డ్రాల్) ఎంచుకుని, ఫారమ్‌ను పూర్తి చేయండి
స్టెప్ 7:
మీ అభ్యర్థనను విజయవంతంగా సమర్పించిన తర్వాత, మీరు క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్‌ను అందుకుంటారు.
దీంతో EPF నుంచి నగదును విత్‌డ్రాకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసినట్లే. మీ డబ్బు మీ అకౌంట్లోకి సుమారు 5 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ PF డబ్బు విత్‌డ్రా ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి మీకు 'ట్రాక్ క్లెయిమ్' ఆప్షన్ ద్వారా మీకు ఇచ్చిన క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు.
పింఛను ఉపసంహరణ, COVID-19 అడ్వాన్స్ అభ్యర్థించడానికి, ఉద్యోగి పాస్‌బుక్‌ని యాక్సెస్ చేయడానికి కూడా ఈ ఉమంగ్ యాప్‌ని ఉపయోగించవచ్చు.
సంబంధిత కథనం