గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజూ పావుగంట పాటూ జపించడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు-chanting the gayatri mantra for a quarter of an hour every day has amazing health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజూ పావుగంట పాటూ జపించడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు

గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజూ పావుగంట పాటూ జపించడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు

Haritha Chappa HT Telugu

గాయత్రి మంత్రం వేద మంత్రాలకు మూలమని చెబుతారు. దీనిలో ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

గాయత్రీ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యం

గాయత్రి మంత్రం అతి ప్రాచీనమైనది, ఎంతో శక్తివంతమైనది కూడా. పురాతన కాలం నుండి హిందూమతంలో మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేద కాలం నుండి, మంత్రాల పఠనం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పురోగతికి ఒక ముఖ్యమైన సాధనంగా చెప్పుకుంటారు.

ఉదయం ప్రాణాయామంతో పాటు మంత్రాలను పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. గాయత్రి మంత్రం విషయానికొస్తే, ఇది అన్ని వేద మంత్రాలకు మూలంగా చెబుతారు. గాయత్రీ మంత్రాన్ని ప్రశాంతమైన వాతావరణంలో పఠిస్తే, అది మనస్సు, శరీరంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయాన్నే గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఒత్తిడి తగ్గించడానికి

ప్రశాంతమైన ఉదయం వాతావరణంలో గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మనస్సు, శరీరంపై చాలా సానుకూల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మంత్రాలను లోతైన శ్వాసతో జపించినప్పుడు దాని ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం మనస్సును శాంతపరచడానికి, ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది. గాయత్రి మంత్రం 'ఓం' అక్షరంతో ప్రారంభమవుతుంది. ఈ అక్షరం నుంచి వచ్చే ప్రకంపనలు మనస్సును శాంతపరచడానికి, విశ్రాంతిని ఇచ్చే హార్మోన్లను విడుదల చేయడానికి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యానికి

ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ మంత్రాలు పఠించడం వల్ల శ్వాస మందగిస్తుంది. ఇది హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచేలా

గాయత్రీ మంత్రాన్ని రోజూ జపించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత శక్తిలో సానుకూల మెరుగుదల కనిపిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించేవారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇతరులతో పోలిస్తే పదునుగా ఉంటాయి. నిజానికి గాయత్రి మంత్రం జపించడం వల్ల ముఖం, తలపై మూడు చక్రాలు ఉత్తేజితమవుతాయి. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి సంబంధించినది. మంత్రాల ప్రకంపనలు మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. గాయత్రి మంత్రం మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వృద్ధాప్యాన్ని నెమ్మదించేలా

గాయత్రీ మంత్రాన్ని ప్రతిరోజూ కొద్దిసేపు లోతైన శ్వాసతో పాటు జపిస్తే దాని సానుకూల ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. మంత్రాలు జపించేటప్పుడు కలిగే ప్రకంపనలు ముఖంపై అనేక పాయింట్లను ఉత్తేజపరుస్తాయి. ఇది రక్త ప్రసరణను పెంచడమే కాకుండా చర్మం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. లోతైన శ్వాస శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతిరోజూ గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రకంపనలు హైపోథాలమస్ గ్రంథిని ఉత్తేజపరుస్తాయి. ఈ గ్రంథి శరీరంలోని అనేక విధులను నిర్వర్తించడమే కాకుండా మన రోగనిరోధక వ్యవస్థకు కూడా బాధ్యత వహిస్తుంది. అంతేకాకుండా ఇది మన శరీరంలో హ్యాపీనెస్ హార్మోన్లను పెంచుతుంది. తద్వారా రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

(గమనిక: ఇది నమ్మకాలు, శాస్త్రాలపై ఆధారపడి రాసినది. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు అందులోని అన్ని అంశాలను ధృవీకరించడం లేదు. మీ సొంత విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం