Chanakya Niti Telugu : పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ 3 పనులు చేస్తే వారి భవిష్యత్ ప్రమాదకరం-chanakya niti telugu 3 mistakes parents should not make in front of children ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Chanakya Niti Telugu 3 Mistakes Parents Should Not Make In Front Of Children

Chanakya Niti Telugu : పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ 3 పనులు చేస్తే వారి భవిష్యత్ ప్రమాదకరం

HT Telugu Desk HT Telugu
Aug 07, 2023 03:30 PM IST

Chanakya Niti Telugu : చాణక్యుడు చిన్నాపెద్దా.. అందరి కోసం విలువైన మాటలు చెప్పాడు. మానవ జీవితం గురించి ఆయనకు గొప్ప అవగాహన ఉంది. చాణక్య నీతి జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. విజయపథంలో నడిపిస్తుంది. పిల్లలను ముందు తల్లిదండ్రులు చేయకూడని పనుల గురించి చాణక్యుడు చెప్పాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి

చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన వివిధ విషయాల గురించి మాట్లాడాడు. తల్లిదండ్రులకు కొన్ని ఉపయోగకరమైన సలహాలు కూడా ఇచ్చాడు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ముందు కొన్ని పనులు చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. తల్లిదండ్రులు చేసేవి, చెప్పేవి అన్నీ వారి పిల్లల జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. పిల్లలతో మీరు ఎలా ప్రవర్తిస్తారో, వారు భవిష్యత్ లో అలానే వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలని చాణక్యుడు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

ప్రతి ఒక్కరూ పిల్లల ముందు జాగ్రత్తగా ఆలోచించాలని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. ఎందుకంటే పిల్లలు చిన్న మొక్క వలె సున్నితంగా ఉంటారు. మీరు ఆలోచించి మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోవడం వారి ముందు చేస్తే.. మిమ్మల్ని పరిశీలించి.. వారు కూడా అలానే చేస్తారు. భవిష్యత్తులో వారు తదనుగుణంగా మారతారు.

చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరిచే పదాలు, దూషించే పదాలు ఉపయోగించకూడదు. ఇది భవిష్యత్తులో మీకు, మీ పిల్లలకు మరింత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. పిల్లలను నాగరికులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి తల్లిదండ్రులు తమ బాధ్యతను గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలి. పిల్లల ముందు చాలా మర్యాదగా మాట్లాడాలి.

చాలా మంది పిల్లల ముందు మాట్లాడేటప్పుడు పరువు, నైతికత గురించి ఆలోచించరు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఈ తప్పు చేయకూడదు. పిల్లల ముందు ప్రమాణాలు చేయవద్దు. ఇది పిల్లల మనస్సులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు మాట్లాడేటప్పుడు గౌరవంతో మాట్లాడాలి. ఇతరుల గురించి మంచిగా మాట్లాడాలి.

పిల్లల ముందు అబద్ధాలు ఆడకూడదని చాణక్యుడు చెప్పాడు. వారి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే, మీ అబద్ధాలలో వారిని కూడా కలిపితే.. మీపై గౌరవం, నమ్మకాన్ని కోల్పోతారు. వారు మీకు కూడా అబద్ధాలు చెప్పడం ప్రారంభించవచ్చు. కాబట్టి పిల్లలకు అబద్ధాలు చెప్పకండి. అలా చేయమని ప్రోత్సహించకండి.

తల్లితండ్రులు తమ పిల్లల ముందు గొడవ పడడం, ఇతరుల తప్పుల గురించి గట్టిగా మాట్లాడడం వంటివి చేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు అని చాణక్యుడు చెప్పాడు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం పోతుంది. అందువల్ల, పిల్లలు మిమ్మల్ని అవమానించడానికి, చెడుగా చిత్రీకరించడానికి వెనుకాడరు. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు.

పిల్లలు దేవుడితో సమానం. కాబట్టి పిల్లలను ఎంతో ప్రేమగా పెంచాలి. ఐదేళ్ల వరకు ప్రేమతో అన్నీ నేర్పించాలి. పిల్లలు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయరు. పిల్లలు మిమ్మల్ని చూసి అన్నీ నేర్చుకుంటారు. వారు మర్యాదపూర్వకంగా ఉండాలని మీరు కోరుకుంటే, వారి భాషను మెరుగుపరచడం మొదటి పని. అందుకు వారి ముందు మాట్లాడేటప్పుడు మంచి భాష వాడాలి. పిల్లల ముందు చెడు పదాలు వాడవద్దు. ఎందుకంటే పిల్లలు పెద్దల మాట విని నేర్చుకుంటారు. పిల్లల ముందు ఎప్పుడూ మంచిగా మాట్లాడండి. బాగా ప్రవర్తించండి.

WhatsApp channel