Chai with Pakoras: సూపర్ అండ్ సింపుల్ పకోడీ వెరైటీలు మీ కోసం.., స్నాక్స్ టైంలో లాగించేయండి మరి!
Chai with Pakoras: చలికాలం వేడివేడి ఛాయ్ తాగితే ఎంత బాగుంటుందో.. పక్కనే వేడిగా పకోడీ పెట్టుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మరి మీకూ ఆ టేస్ట్ ఎంజాయ్ చేయాలని ఉందా.. ఈ రెసిపీలు ట్రై చేయండి మరి!
చలికాలం ఉన్నంతకాలం తాత్కాలిక, త్వరిత ఉపశమనం కావాలనుకునే ప్రతి వారికీ గుర్తొచ్చేది ఒకటే వేడిగా ఛాయ్. చాలా ప్రాంతాల్లో బజ్జీలుగా పిలిచే వీటిని మన దక్షిణాదిలో పకోడీలు అంటుంటాం. శతబ్దాలుగా భారతీయులు ఇష్టంగా తినే వంటల్లో పకోడీలు భాగమైపోయాయి. పండుగ రోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లోనూ కచ్చితంగా తయారుచేసుకునే ఈ వంటకం ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తుంటారు.

కరకరలాడుతూ ఉండే ఈ పకోడీలు రుచిగా అనిపించి ఇంకా తినాలని అనిపిస్తుంటాయి. ప్రత్యేకించి ఛాయ్ తో పాటు తింటే అంతకుమించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక పకోడీలు అంటే ఒకే రకంగా చేసుకోవాలనేం లేదు. ఇందులో బోలెడు రకాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి.
- ఉల్లిపాయ పకోడీ
- పాలకూర పకోడీ
- మెంతి పకోడీ
- ఆలూ పకోడీ
- గోబీ పకోడీ
- పెసరపప్పు పకోడీ
మరి వీటి రెసిపీలు చూసేద్దామా..
ఉల్లి పకోడీ (Onion Pakora): సన్నగా తరిగిన ఉల్లిపాయలతో తయారుచేసుకునే ఈ పకోడీ కరకరలాడుతూ ఉంటుంది. శనగపిండి, జీలకర్ర, ధనియాలు, పసుపు వంటి పదార్థాలను కలపి రుచికరమైన ఉల్లి పకోడీని తయారుచేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయించాక క్యారెమెలైజ్ అయి, ఆహ్లాదకరమైన తియ్యదనాన్ని జోడిస్తాయి.
పాలక్ పకోడీ (Spinach Pakora): తాజా పాలకూర ఆకులను మసాలా శనగపిండి పిండిలో ముంచి, కరకరలాడే వరకు వేయించాలి. పాలకూర రుచి, పిండి, జీలకర్ర, ధనియాలు, కారం పొడిలు కలుపుకుని చేసుకోవడం వల్ల ఈ పకోడీకి అద్భుతమైన రుచి అందుతుంది. పోషకమైన, రుచికరమైన ఈ విందును ఆస్వాదించేయండి మరి.
మెంతి పకోడీ (Fenugreek Pakora): ఈ పకోడీలు తాజా మెంతు ఆకులతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటాయి. తరిగిన ఉల్లిపాయలు, అల్లం, శనగపిండి, బియ్యపు పిండిలో కలిపి తయారుచేస్తారు. బయటకు కరకరలాడుతూ లోపల భాగం మెత్తగా ఉండి మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
ఆలూ బజ్జీ (Potato Pakora): చలికాలం తప్పక తినాలనిపించే వంటకమిది. ఆలూ బజ్జీలు ఉడికించిన బంగాళాదుంపలను జీలకర్ర, ధనియాలు, పసుపు వంటి పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. బంగాళాదుంప మిశ్రమాన్ని మసాలాలు కలిపిన శనగపిండిలో ముంచి, కరకరలాడే వరకు వేయించాలి. బయట క్రిస్పీగా ఉన్నప్పటికీ లోపల మృదువైన, రుచికరమైన బంగాళాదుంపలు ఉంచడం వల్ల అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.
గోబీ పకోడీ (Cauliflower Pakora): లేత కాలీఫ్లవర్ పువ్వులను పసుపు, అజ్వైన్ (వాము), అల్లం, పచ్చిమిర్చి వేసి రుచికరమైన శనగపిండి పిండిలో ముంచాలి. వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ అంటే కరకరలాడే వరకు వేయించుకోవాలి. గోబీ పకోడీలు సంతృప్తికరమైన, కరకరలాడుతూ చక్కటి రుచిని అందిస్తాయి. మీరు పనీర్ లేదా ఇతర కూరగాయలను పిండిలో ఇంకొన్ని ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
మూంగ్ దాల్ పకోడీ (Moong Lentil Pakora): నానబెట్టి రుబ్బుకున్న మూంగ్ దాల్ (పెసర పప్పు)తో చేసే పకోడీ. జీలకర్ర, ధనియాలు, ఇంగువ వంటి పదార్థాలు వాడటం వల్ల వీటి రుచి రెట్టింపు అవుతుంది. బయట కరకరలాడే ఈ పకోడీ, లోపల మృదువుగా ఉండి తినేందుకు చక్కగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో క్యారెట్లు లేదా పాలకూర వంటి తురిమిన కూరగాయలను అదనంగా చేర్చుకుంటే మరింత రుచితో పాటు పోషక విలువలు కూడా పెరుగుతాయి.
సంబంధిత కథనం