Gold Monetization Scheme | బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టారా? అయితే ఇది మీ కోసమే-central government trying to huge changes in gold monetization scheme ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Central Government Trying To Huge Changes In Gold Monetization Scheme

Gold Monetization Scheme | బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టారా? అయితే ఇది మీ కోసమే

HT Telugu Desk HT Telugu
May 10, 2022 02:30 PM IST

మీరు బ్యాంకు లాకర్లలో బంగారాన్ని ఉంచుతున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. ఎందుకంటే కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో మీరు కూడా లాభపడతారు. ఎలాగో మీరు తెలుసుకోండి.

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్​
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్​

Gold Monetization Scheme | బ్యాంకు లాకర్లలో బంగారాన్ని ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మార్పులు తీసుకురాబోతోంది. ఈ పథకం అమలైతే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఏమి మార్పులు తీసుకురాబోతుందో... దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది బ్యాంక్ లాకర్‌లో పడి ఉన్న బంగారంపై వడ్డీని పొందే పథకం. అయితే ఈ పథకం ప్రయోజనం పొందడానికి.. లాకర్​లో కనీసం 10 గ్రాముల బంగారం ఉండాలి. అయితే గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని దశలవారీగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీని కింద బ్యాంకులో ఉంచిన బంగారం మొత్తం ఐదు గ్రాములకు తగ్గించే యోచనలో ఉంది.

ప్రయోజనం పొందలేకపోతున్నారు..

ప్రజల ఇళ్లలో పడి ఉన్న బంగారం నుంచి డబ్బు సంపాదించడానికి కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద బ్యాంకులో బంగారం ఉంచిన వారికి వడ్డీ లభిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ పథకం కింద బంగారాన్ని బ్యాంకుల్లో ఉంచే వారి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికీ ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. 

రాబోయేకాలంలో మరింత..

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మొదటి దశలో బ్యాంకులో ఉన్న బంగారాన్ని 10 గ్రాముల నుంచి 5 గ్రాములకు తగ్గించవచ్చు. రాబోయే సంవత్సరాల్లో ఈ మొత్తం ఒక గ్రాముకి చేరవచ్చు. ఇంతకు ముందు ఈ పథకంలో కనీసం 30 గ్రాముల బంగారాన్ని బ్యాంకులో ఉంచాలనే నిబంధన ఉండేది. గత సంవత్సరం ఈ మొత్తాన్ని 10 గ్రాములకు తగ్గించారు. 

గ్రామాల్లోనే ఎక్కువ..

ప్రస్తుతం ఈ పథకం కింద బంగారం నిల్వ పరిమితి 10 గ్రాములు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందడం లేదు. అయితే అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాలో.. అత్యధిక బంగారం ఉంది. గ్రామీణ జనాభాలో దాదాపు 25,000 టన్నులు లేదా 16 ట్రిలియన్ల విలువైన బంగారం ఉందని అంచనా.

ఈ పథకం కింద 50 నుంచి 100 గ్రాముల బంగారాన్ని బ్యాంకులో ఉంచాలనుకునే వారిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారించలేరు. 

WhatsApp channel

సంబంధిత కథనం