New Year Party 2025: ఈ ఫ్యాన్సీ డ్రింక్స్ తో ఆల్కహల్ లేకుండా న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోండిలా..
New Year Party 2025: ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిదా.. కాదా అనేది పక్కకుపెడితే ప్రతి ఈవెంట్లోనూ, ప్రతి పార్టీలోనూ ఆల్కహాల్ తీసుకోలేం. ఆరోగ్యపరంగానైనా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అయినా ఆల్కహాల్ కు దూరంగా ఉండాల్సిందే. అటువంటి పరిస్థితుల్లోనూ మీరు మద్యం తీసుకుంటున్న ఫీల్ తో సెలబ్రేషన్ ను ఎంజాయ్ చేయవచ్చు.
న్యూ ఇయర్ అంటేనే దాదాపు చాలా మంది మద్యం, మాంసాహారం అంటూ ఉల్లాసంగా గడిపేయాలనుకుంటారు. కొన్ని పరిస్థితుల రీత్యా అది సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సమయంలో ఆల్కహాల్ తీసుకోకపోయినా తీసుకుంటున్నట్లుగా పీల్ తెప్పించే ఫ్యాన్సీ డ్రింక్స్ చాలా ఉన్నాయి. రుచికరమైన, పోషక విలువలున్న కొన్ని డ్రింక్స్ ను మీ ముందుకు తీసుకొచ్చాం. మరి మీరూ ట్రై చేస్తారా..? ఎటువంటి అపరిశుభ్రమైన, అనారోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించకుండా తయారుచేసుకునే నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇవే.
జాజికాయ కాఫీ రెసిపీ
- 4 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్
- 1 చిన్న దాల్చిన చెక్క
- 2 ఖర్జూరాలు (విత్తనాలు తీసేసినవి)
- చిటికెడు జాజికాయ పొడి
- 2 లవంగాలు
- నారింజ తొక్క
జాజికాయ కాఫీ రెసిపీ
స్టెప్ 1: కాఫీ పొడితో పాటు దాల్చిన చెక్కను నీటిలో వేయండి.
స్టెప్ 2: జాజికాయ, లవంగాలు, నారింజ తొక్క వేసి నీటిని మరిగించండి.
స్టెప్ 3: ఇప్పుడు ఖర్జూరాలను మెత్తగా చేసి అందులో వేయండి.
స్టెప్ 4: చెంచాతో నెమ్మదిగా కలపండి. అలా 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
స్టెప్ 5: మీ జాజికాయ కాఫీ రెడీ. పార్టీలో వేడివేడిగా ఎంజాయ్ చేయండి.
రుచికరమైనది పోషక విలువలున్నది అయిన జాజికాయ కాఫీని తాగడం వల్ల చాలా లాభాలున్నాయి. ఇందులో అదనపు చక్కెరలు, అపరిశుభ్రమైన పదార్థాలు ఉపయోగించకపోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ డ్రింక్ ను ఆస్వాదించవచ్చు.
యాపిల్స్ తో తయారు చేసిన ఈ స్పెషల్ డ్రింక్ ట్రై చేయండి.
ఆపిల్ - లవంగం మిశ్రమం
- 200 మి.లీ ఆపిల్ జ్యూస్
- 1 దాల్చినచెక్క
- 4 నుండి 6 నల్ల మిరియాలు
- నారింజ తొక్క 1
- 2 లవంగాలు
- అల్లం ముక్కలు
- 1 టీస్పూన్ తేనె
ఆపిల్ - లవంగం ఫ్యూజన్ రెసిపీ
స్టెప్ 1: ఆపిల్ రసాన్ని వేడి నీళ్లలో పోసి మొత్తం మసాలా దినుసులు, అల్లం, నారింజ తొక్క, తేనె కలిపి కాసేపటి వరకూ వేడి చేయండి.
స్టెప్ 2: వాటిని బాగా మరిగించి, ఆపై 10 నిమిషాల పాటు ఉడికించండి.
స్టెప్ 3: స్టవ్ ఆపేసిన తర్వాత కాసేపటివరకూ చల్లారనివ్వండి. ఆపై రసాన్ని ఒక గ్లాసులోకి వడకట్టి ఆనందించండి.
దానిమ్మ కొత్తిమీర రసం
- 1 లీటర్ దానిమ్మ రసం
- రోజ్ మేరీ ఆకులు
- 1 దాల్చిన చెక్క
- 1/2 టీస్పూన్ కొత్తిమీర
- 1/2 నారింజ (తరిగినవి)
దానిమ్మ - కొత్తిమీర జ్యూస్ రెసిపీ
స్టెప్ 1: దానిమ్మ రసాన్ని ఒక పెద్ద సాస్ పాన్‌లో పోయాలి.
స్టెప్ 2: రోజ్మేరీ, దాల్చిన చెక్క, కొత్తిమీర, నారింజ ముక్కలు వేసి మరిగించాలి.
స్టెప్ 3: వడకట్టిన దానిని జగ్ లో వేయండి.
స్టెప్ 4: ధనియాలతో గార్నిష్ చేసి, ఈ పానీయాన్ని ఆస్వాదించండి.
స్ట్రాబెర్రీ - జామ స్మూతీ
- తాజా స్ట్రాబెర్రీలు ( 3 కప్పులు)
- 3/4 కప్పు తేనె
- 3/4 కప్పు తాజా నిమ్మరసం (4 నిమ్మకాయలు)
ఇలా ప్రిపేర్ చేయండి.
స్టెప్ 1: స్ట్రాబెర్రీలతో పాటు 2 కప్పుల నీరు, తేనెను వేసి ఒక పాన్లో మీడియం వేడి మీద ఉడకబెట్టండి.
స్టెప్ 2: స్ట్రాబెర్రీలు మెత్తబడే వరకు మీడియం వేడిపై నెమ్మదిగా ఉడికించండి. అప్పుడప్పుడు, సుమారు 10 నిమిషాల వరకూ కలుపుతూ ఉండండి.
స్టెప్ 3: దానిని స్టవ్ మీద నుంచి తీసిన తర్వాత 10 నిమిషాల వరకూ చల్లారనివ్వండి.
స్టెప్ 4: స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని చిన్న గ్లాసుల్లో పోసుకోండి.
స్టెప్ 5: సాధ్యమైనంతగా ద్రవాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. చెంచా వెనుక భాగంతో ఒత్తిడిని కల్పించండి. అలా రసాన్ని బయటకు నెట్టండి.
స్టెప్ 6: ఆ తర్వాత అందులో కాస్త నిమ్మరసం, కొద్దిగా నీరు కలపండి.
స్టెప్ 7: అందులో కొన్ని ఐస్ ముక్కలు యాడ్ చేసుకుని, స్ట్రాబెర్రీలతో గార్నిష్ చేయండి. ఇక సర్వ్ చేయడానికి రెడీ అయిపోయినట్లే.
కొబ్బరి జ్యూస్
- 2 చెంచాల కొబ్బరి గుజ్జు
- 1/2 టీస్పూన్ పంచదార లేదా తేనె
- 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి
- 1/4 టీస్పూన్ రాతి ఉప్పు
ఈ డ్రింక్ ను ఇలా తయారు చేసుకోవాలి.
స్టెప్ 1: కొబ్బరిపై భాగాన్ని కట్ చేసి, నీటిని సేకరించండి.
స్టెప్ 2: కొబ్బరికాయలోని కొబ్బరి లేత గుజ్జును బయటకు తీసి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: కొబ్బరి గుజ్జు, కొబ్బరి నీళ్లు మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేయాలి.
స్టెప్ 4: దీన్ని ఒక జార్ లోకి మార్చండి. ఆ తర్వాత దానిలో రాక్ షుగర్, నల్ల మిరియాల పొడి, రాక్ సాల్ట్ జోడించి అన్నింటిని బాగా కలపాలి.
స్టెప్ 5: అవసరమైన విధంగా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. అవసరం లేకపోతే ఐస్ కలపకూడదు.
సంబంధిత కథనం