Carrot Rava Laddu: టేస్టీ క్యారెట్ రవ్వ లడ్డు చూస్తేనే తినేయాలనిపిస్తుంది, రెసిపీ చాలా సులువు-carrot rava laddu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Rava Laddu: టేస్టీ క్యారెట్ రవ్వ లడ్డు చూస్తేనే తినేయాలనిపిస్తుంది, రెసిపీ చాలా సులువు

Carrot Rava Laddu: టేస్టీ క్యారెట్ రవ్వ లడ్డు చూస్తేనే తినేయాలనిపిస్తుంది, రెసిపీ చాలా సులువు

Haritha Chappa HT Telugu
Nov 03, 2024 11:30 AM IST

Carrot Rava Laddu: క్యారెట్ హల్వా, రవ్వ లడ్డు విడివిడిగా తిని ఉంటారు. ఈ రెండింటినీ కలిపి చేసే క్యారెట్ రవ్వలడ్డు తిన్నారంటే రుచి అదిరిపోతుంది. పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది.

క్యారెట్ రవ్వ లడ్డు రెసిపీ
క్యారెట్ రవ్వ లడ్డు రెసిపీ

రవ్వ లడ్డు, క్యారెట్ హల్వా... ఈ రెండూ తెలుగువారికి పరిచయమే. ఒకసారి ఈ రెండింటినీ కలిపి క్యారెట్ రవ్వ లడ్డు చేసి చూడండి రుచి అదిరిపోతుంది. అతిధులకు వడ్డించేందుకు ఇది బెస్ట్ స్వీట్ అని చెప్పవచ్చు. పిల్లలు కూడా ఇంట్లో దీన్ని ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాము. కాబట్టి శరీరానికి శక్తి కూడా అందుతుంది. క్యారెట్ రవ్వ లడ్డు ఎలా చేయాలో తెలుసుకోండి.

క్యారెట్ రవ్వ లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు

జీడిపప్పు - అర కప్పు

బాదంపప్పు - అర కప్పు

నెయ్యి - మూడు స్పూన్లు

ఉప్మా రవ్వ - ఒక కప్పు

క్యారెట్ తురుము - ఒక కప్పు

కొబ్బరి తురుము - అరకప్పు

పంచదార - ఒకటిన్నర కప్పు

యాలకుల పొడి - అర స్పూను

పాలు - పావు కప్పు

క్యారెట్ రవ్వ లడ్డు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

2. ఆ నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పులను వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వను వేసి వేయించాలి.

3. అది కాస్త రంగు మారాక క్యారెట్ తురుమును వేసి వేయించుకోవాలి.

4. పచ్చివాసన పోయేదాకా ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.

5. తర్వాత కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

6. ఇది వేయిస్తున్నప్పుడు చిన్న మంట మీద ఉండేలా చూసుకోవాలి.

7. ముందుగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పులను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

8. ఆ పొడిని కూడా కళాయిలో వేసి బాగా కలపాలి.

9. ఈ మిశ్రమంలో కాచి చల్లార్చిన పాలను వేసి మెల్లగా కలుపుతూ ఉండాలి.

10. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా గట్టిగా అయ్యేవరకు కలపాలి.

11. ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేయాలి.

12. అది చల్లబడే వరకు ఉంచాలి. మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక లడ్డూల్లా చుట్టుకోవాలి.

13. అంతే క్యారెట్ రవ్వ లడ్డు సిద్ధమైనట్టే.

14. ఇది రుచిలో అదిరిపోతుంది. చూస్తేనే నోరించేలా ఉంటుంది. ఒక్కసారి ఇది మీకు చేసి చూడండి. మీ ఇంటిలో పాతికి నచ్చడం ఖాయం.

మోతీచూర్ లడ్డూలు ఎంతలా నోరూరిస్తాయో ఈ క్యారెట్ రవ్వ లడ్డు కూడా అంతే నోరు నోరూరిస్తుంది. పైగా ఇందులో మనం రకరకాల పదార్థాలను వాడాము. క్యారెట్, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి ఈ స్వీట్ రోజుకి ఒకటి తినడం వల్ల మంచే జరుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం దీన్ని తినడం తగ్గిస్తేనే మంచిది. ఎందుకంటే దీంట్లో పంచదార అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ స్వీట్ తినడం మంచిది కాదు.

Whats_app_banner