Carrot Cake: క్యారెట్‌తో టేస్టీ కేక్ రెసిపీ, ఇంట్లోనే దీన్ని తయారుచేస్తే పిల్లలకు ఇది ఎంతో నచ్చుతుంది-carrot cake recipe with eggs in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Cake: క్యారెట్‌తో టేస్టీ కేక్ రెసిపీ, ఇంట్లోనే దీన్ని తయారుచేస్తే పిల్లలకు ఇది ఎంతో నచ్చుతుంది

Carrot Cake: క్యారెట్‌తో టేస్టీ కేక్ రెసిపీ, ఇంట్లోనే దీన్ని తయారుచేస్తే పిల్లలకు ఇది ఎంతో నచ్చుతుంది

Haritha Chappa HT Telugu
Jun 16, 2024 03:30 PM IST

Carrot Cake: క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లో దీన్ని సులువుగా తయారుచేయవచ్చు. పిల్లలకు ఈ కేకు నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.

క్యారెట్ కేక్ రెసిపీ
క్యారెట్ కేక్ రెసిపీ

Carrot Cake: క్యారెట్ తో చేసుకున్న వంటకాలు పిల్లలకు చాలా నచ్చుతాయి. ఇక్కడ మేము క్యారెట్ తో కేక్ ఎలా చేయాలో ఇచ్చాము. దీన్ని చాలా సులువుగా వండొచ్చు. పిల్లల పుట్టినరోజులకు, వేడుకలకు ఇంట్లోనే ఈ కేకు చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ కేకు చేయడం చాలా సులభం.

క్యారెట్ కేక్ రెసిపీకి కావలసిన పదార్థాలు

క్యారెట్ తురుము - మూడు కప్పులు

గోధుమ పిండి - రెండు కప్పులు

బేకింగ్ సోడా - ఒక స్పూను

బేకింగ్ పౌడర్ - రెండు స్పూన్లు

దాల్చిన చెక్క పొడి - రెండు స్పూన్లు

నూనె - ఒక కప్పు

బ్రౌన్ షుగర్ - ఒక కప్పు

గుడ్లు - నాలుగు

వెనిల్లా ఎసెన్స్ - రెండు స్పూన్లు

క్యారెట్ కేక్ రెసిపీ

1. క్యారెట్ సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు మరొక గిన్నెలో నూనె, పంచదార వేసి కలపాలి.

4. అందులోనే కోడిగుడ్లను కొట్టి గిలకొట్టాలి.

5. అదే గిన్నెలో క్యారెట్ తురుము, డ్రై ఫ్రూట్స్ తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

6. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నా గోధుమపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.

7. కేక్ మౌల్డ్ లో అడుగున గోధుమపిండి లేదా వెన్న రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి.

8. ఓవెన్ లో చేయాలనుకునేవారు ముందుగానే దాన్ని 180 డిగ్రీస్‌కు ప్రీ హీట్ చేసుకోవాలి.

9. అలా ప్రి హీట్ చేసిన ఓవెన్లో ఈ కేక్ మౌల్డ్ ను ఉంచి అరగంట పాటు వదిలేయాలి. అంతే కేక్ రెడీ అయిపోతుంది.

ఇక ఓవెన్ లేనివారు కుక్కర్లో అడుగున ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఈ మౌల్డ్ ఉంచి పైన మూత పెట్టాలి. మధ్యస్థ మంట మీద అరగంట పాటు ఉంచితే కేక్ రెడీ అయిపోతుంది. ఈ కేక్ పై చాక్లెట్ కరిగించి వేసి పైన డ్రైఫ్రూట్స్ను జల్లి గార్నిష్ చేయవచ్చు. లేదా వైట్ క్రీమ్ ను వేసి కూడా గార్నిష్ చేసుకోవచ్చు.

WhatsApp channel