సూర్యరశ్మి నుండి రక్షణ విషయానికి వస్తే, షెల్ఫ్ నుండి ఏ సన్‌స్క్రీన్ పడితే అది తీసుకుంటే సరిపోదు. చాలా ఉత్పత్తులు బ్రాడ్-స్పెక్ట్రమ్ రక్షణ, SPF ప్రయోజనాలను అందిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అన్ని ఫార్ములేషన్లు ఒకేలా ఉండవు. కొన్నింటిలో ఆరోగ్య సమస్యలను పెంచే పదార్థాలు కూడా ఉండవచ్చు.
చర్మాన్ని నిజంగా హాని నుండి కాపాడటానికి ఏం చూడాలి, ఏమి నివారించాలో కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్ చోప్రా జూన్ 6న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.
"అన్ని సన్‌స్క్రీన్లు ఒకేలా ఉండవు. కొన్నింటిలో మీ చర్మానికి నచ్చని రహస్య రసాయనాలు ఉంటాయి. తెలివిగా ఎంచుకోండి. లేబుల్ చదవండి. మీ చర్మాన్ని సరైన మార్గంలో రక్షించుకోండి" అని డాక్టర్ అలోక్ చోప్రా క్యాప్షన్‌లో రాశారు.
"మీ సన్‌స్క్రీన్ మీ హార్మోన్లకు నిశ్శబ్దంగా హాని కలిగించవచ్చు. చాలా వాణిజ్య సన్‌స్క్రీన్లలో ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు నిండి ఉంటాయి. మీరు వాటిని మీ చర్మానికి అప్లై చేసినప్పుడు, అవి మీ రక్తప్రవాహంలో కలిసిపోతాయి. కాబట్టి, సన్‌స్క్రీన్ కొనే ముందు, మీరు దానిలో ఉండే పదార్థాలను జాగ్రత్తగా చదవాలి." అని హెచ్చరించారు.
హానికరమైన పదార్థాల జాబితాను వివరించారు."ఆక్సిబెంజోన్ (oxybenzone), మెథాక్సీసిన్నమేట్ (methoxycinnamate) లేదా అవోబెంజోన్ (avobenzone) వంటివి కనిపిస్తే దానిని కొనవద్దు. ఇవి ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్, అంటే ఇవి మీ శరీర హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగిస్తాయి. అలాగే, లేబుల్‌పై 'ఫ్రాగ్రెన్స్' అని ఉంటే, దానిని నివారించండి. ఆ ఒక్క పదం థాలేట్స్ (phthalates) మరియు పారాబెన్స్ (parabens) వంటి రసాయనాల కలయికను దాచిపెట్టగలదు. ఇవి రెండూ హార్మోన్లను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలతో ముడిపడి ఉన్నాయి..’ అని వివరించారు.
డాక్టర్ చోప్రా జింక్ ఆక్సైడ్ (zinc oxide) లేదా టైటానియం డయాక్సైడ్ (titanium dioxide) వంటి పదార్థాలతో కూడిన మినరల్ ఆధారిత సన్‌స్క్రీన్లను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. "ఇవి రక్తప్రవాహంలోకి శోషితమవకుండా చర్మం పైభాగంలో ఉంటాయి..’ అని వివరించారు.
సరైన ఫేషియల్ సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఆయన మరింత నొక్కి చెప్పారు. "ముఖానికి వాడే సన్‌స్క్రీన్ల విషయానికి వస్తే, తెలివిగా ఎంచుకోవడం ఇంకా ముఖ్యం. ముఖ చర్మం మృదువుగా ఉంటుంది. ఎక్కువ శోషిస్తుంది. తరచుగా సూర్యరశ్మికి గురవుతుంది. అంటే మీ సన్‌స్క్రీన్‌లోని ఏవైనా విష పదార్థాలు మీ రక్తప్రవాహంలోకి త్వరగా చేరతాయి. చాలా వాణిజ్య ఫేస్ సన్‌స్క్రీన్లు తేలికైనవి లేదా జిడ్డు లేనివిగా మార్కెట్ అవుతుంటాయి. కానీ వాటిలో ఇప్పటికీ అదే హానికరమైన రసాయనాలు ఉంటాయి. బదులుగా, 'నాన్-కోమెడోజెనిక్' అని లేబుల్ చేసిన మినరల్ సన్‌స్క్రీన్ల కోసం చూడండి. అంటే అవి మీ రంధ్రాలను అడ్డుకోవని అర్థం. వాటిలో ఫ్రాగ్రెన్స్, పారాబెన్స్ మరియు సిలికాన్లు కూడా ఉండకూడదు." అని సూచించారు.
"దీన్ని గుర్తుంచుకోండి. మీరు మీ చర్మంపై పూసే క్రీములు మీ నోటిలో వేసుకునే దానిలాగే మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగించవచ్చు. జాగ్రత్తగా ఎంచుకోండి. మీ హార్మోన్ ఆరోగ్యం దానిపై ఆధారపడి ఉంటుంది" అని డాక్టర్ చోప్రా ముగించారు.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే, మరియు వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
టాపిక్