Cardboard box DIY: పాత అట్టపెట్టెలతో క్యాలెండర్, ఆర్గనైజర్ మరెన్నో.. ఇలా చేసేయండి-cardboard box diy ideas calendar organizer showcase and more ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cardboard Box Diy: పాత అట్టపెట్టెలతో క్యాలెండర్, ఆర్గనైజర్ మరెన్నో.. ఇలా చేసేయండి

Cardboard box DIY: పాత అట్టపెట్టెలతో క్యాలెండర్, ఆర్గనైజర్ మరెన్నో.. ఇలా చేసేయండి

Cardboard box DIY: ఇంట్లో కార్డ్‌బోర్డ్ బాక్స్ ఉంటే దానికి కొత్త రూపమిచ్చి పనికొచ్చే వస్తువు లాగా తయారు చేసేయొచ్చు. అదెలాగో చూసేయండి.

కార్డ్‌బోర్డ్ బాక్స్ డీఐవై (shutterstock)

షూలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాడ్జెట్లు, ఆన్‌లైన్ లో కొన్న పార్శిళ్లు.. ఏవైనా సరే అట్టపెట్టేలోనే పెట్టిస్తారు. అయితే వాటిని దేనికైనా పనికొస్తాయేమో అని ఉంచి ఉంచీ చివరికి పడేస్తాం. ఈసారి అలా పడేయాల్సిన అవసరం లేకుండా వాటితో ఆకర్షణీయమైన వస్తువులు ఎలా చేయాలో చూడండి. చాలాా సింపుల్ గా రెడీ అవుతాయివి.

కార్డ్‌బోర్డ్ తో ఆర్గనైజర్
కార్డ్‌బోర్డ్ తో ఆర్గనైజర్ (pinterest)

ఆర్గనైజర్:

అట్టపెట్టెను ఆర్గనైజర్ లాగా వాడుకోవచ్చు. అయితే దానిమీద ఏవో కంపెనీ పేర్లు అన్నీ కనిపిస్తుంటాయి. అలాగే దాన్ని వాడుకోలేం కూడా. అందుకే దాన్ని కాస్త కళాత్మకంగా తయారు చేయండి. ఇంట్లో పాత బియ్యం బస్తా ఉంటే దాన్ని కత్తిరించి ఈ అట్టపెట్టెకు చుట్టేయండి. మీద మీకిష్టమైన రంగులతో ముస్తాబు చేస్తే సరి. లేదంటే మందపాటి దారం ఉంటే పెట్టె చుట్టూ దాన్ని చుట్టేయండి. మంచి లుక్ వస్తుంది. మీకు మరికాస్త ఓపిక ఉంటే.. న్యూస్ పేపర్లు లేదా రంగుల పేపర్లను చుట్టి స్ట్రాలాగా తయారు చేయండి. వాటిని డబ్బా చుట్టూ అతికిస్తే చాలా అందంగా కనిపిస్తాయి.

బుక్ షెల్ఫ్:

పుస్తకాలు నిలువుగా పట్టేంత అట్ట పెట్టెలుంటే వాటిని బుక్ షెల్ఫ్ లాగా వాడొచ్చు. దానికోసం ఒక అట్టపెట్టె పైభాగం చివర్లను కాస్త ఏటవాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది.

కార్డ్‌బోర్డ్ తో షోకేజ్
కార్డ్‌బోర్డ్ తో షోకేజ్ (pinterest)

షోకేస్ లాగా:

కార్డ్ బోర్డును మీకిష్టమైన ఆకృతిలో కట్ చేసుకుని అతికించండి. దాని మధ్యలో అరల్లాగా కార్డ్ బోర్డ్ ముక్కలని అతికించుకుంటే చాలు. దీన్ని గోడకు అతికిస్తే మంచి షోకేజ్ రెడీ అయినట్లే. దీంట్లో చిన్న వస్తువులు ఏవైనా పెడితే మంచి లుక్ ఉంటుంది. పైన రంధ్రం చేసి గోడల మూలల్లో వేలాడదీసినా బాగుంటుంది. దీనికి మంచి రంగు పెయింట్ వేసి లుక్ పూర్తి చేయండి.

క్యాలెండర్
క్యాలెండర్ (pinterest)

డెస్క్ క్యాలెండర్:

పైన ఫొటోలు చూయించినట్లుగా కార్డ్ బోర్డుతో డెస్క్ టాప్ క్యాలెండర్ తయారు చేయొచ్చు. 12 నెలల కోసం 12 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక 0 నుంచి 9 అంకెలుండే 2 సెట్లను కట్ చేసుకుంటే చాలు. వాటి మీద అంకెలు చక్కగా రాసుకోవాలి. చుట్టూ కార్డ్ బోర్డ్ తోనే ఫ్రేమ్ తయారు చేసి నెలల్ని, అంకెల్ని వేలాడదీస్తే సరిపోతుంది. దీనికి మీ సృజనాత్మకతను జోడించి మంచి రంగులు, బొమ్మలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది.

మేజ్ గేమ్:

కార్డ్ బోర్డ్ డీఐవై
కార్డ్ బోర్డ్ డీఐవై (pinterest)

చిన్న పిల్లలకు కార్డ్‌బోర్డ్ వాడి మంచి మేజ్ గేమ్ తయారు చేసి ఇవ్వవచ్చు. చేయాల్సిందల్లా చిన్న చిన్న అట్టముక్కలు కట్ చేయడమే. కార్డ్ బోర్డ్ మరీ లోతుగా ఉంటే.. సగానికి కట్ చేసేయండి. దాని మీద అక్కడక్కడా రంధ్రాలు చేయండి. మేజ్ లాగా అట్ట ముక్కల్ని అతికించండి. చిన్న బాల్ వేస్తే మొదటి నుంచి చివరికి చేరేలా ఒక గేమ్ తయారు చేసేయండి. పిల్లలకు మంచి యాక్టివిటీ అవుతుంది.

ఈ పనికిరాని కాగితపు కార్డ్బోర్డులను విసిరేయడానికి బదులుగా, వాటిని కాస్త చక్కగా కట్ చేసి రంగు వేసేసి టేబుల్ మీద పెట్టేసుకున్నా అవసరం లేని వస్తువులు వేసుకోడానికి పనికొస్తాయి. వాటిని వృధాగా పడేయకుండా కాస్త మెదడుకు పని చెప్పండి.