Cancer and Acne: మొటిమలను తగ్గించే క్రీముల్లో క్యాన్సర్ కారకాలు, జాగ్రత్తగా వాడమంటున్న కొత్త అధ్యయనం
Cancer and Acne: మొటిమలు తగ్గించేందుకు ఎన్నో క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఒక అధ్యయనంలో ఇలాంటి కాస్మోటిక్ క్రీముల్లో అధిక స్థాయిలో బెంజీన్ ఉన్నట్టు తేలింది. ఇవి కాన్సర్ ను కలిగించే కారకం. కాబట్టి అలాంటివి వాడడం చాలా ప్రమాదకరం.
మొటిమల సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యం యువత మొటిమల బారిన పడతారు. అయితే మొటిమలు తగ్గించేందుకు వాడే క్రీముల్లో క్యాన్సర్ తో ముడిపడి ఉన్న అధిక స్థాయి రసాయనాన్ని ఉన్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. అమెరికన్ టీనేజర్లు విస్తృతంగా ఉపయోగించే ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పై ఒత్తిడి పెరుగుతోంది. కేవలం అమెరికాలోనే కాదు మనదేశంలో కూడా వీటి వాడకం ఎక్కువగానే ఉంది.
అధిక స్థాయిలో బెంజీన్
అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో ప్రధాన రిటైలర్లలో లభించే 100 కి పైగా మొటిమలు తగ్గించే క్రీముల్లో బెంజాయిల్ పెరాక్సైడ్ ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. మూడింట ఒక వంతు క్యాన్సర్‌కు కారణమయ్యే అధిక స్థాయి బెంజీన్ తో కలుషితమైనట్లు వారు కనుగొన్నారు.
మొటిమలు తగ్గించే క్రీములలో శక్తివంతమైన కార్సినోజెన్ పరిమాణం కంటే 18 రెట్లు ఎక్కువగా ఉందని జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో ప్రచురించిన అధ్యయనంలో ఉంది. ఈ అధ్యయనం ప్రకారం డజన్ల కొద్దీ ఫేస్ క్రీములలో బెంజాయిల్ పెరాక్సైడ్ ను మొటిమల చికిత్సలో భాగంగా వాడుతున్నారు.
మరొక విశ్లేషణలో మొటిమల క్రీములు, క్లెన్సర్లలో కూడా ఈ క్యాన్సర్ కారకం ఉన్నట్టు గుర్తించారు. అధిక స్థాయిలో బెంజీన్ ఉన్న ఉత్పత్తులను తిరిగి మార్కెట్ నుంచి వెనక్కి తీసుకురావాలని కూడా అమెరికాలో ఆదేశాలు వచ్చాయి.
ప్రయోగశాలలో ఈ ఫేస్ క్రీము రాసుకుని అధిక ఉష్ణోగ్రతలకు గురైతే అది క్యాన్సర్ కారకంగా మారుతుంది. క్లీన్ & క్లియర్, న్యూట్రోజెనా సంస్థలకు చెందిన కొన్ని మొటిమల క్రీములు, క్లెన్సర్లలో అధిక స్థాయిలో బెంజాయిల్ రసాయనం ఉన్నట్లు కనుగొన్నారు.
మన శరీరం అతినీలలోహిత కాంతికి గురైనప్పుడు ఫేస్ క్రీములో ఉన్న బెంజీన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని సోమవారం ప్రచురించిన అధ్యయనం కనుగొంది. ఇది వినియోగదారులు ఎండలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చని సూచిస్తుంది. అంటే ఈ క్రీమ్ రాసుకుని ఎండలోకి వెళితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అర్థం.
తమ ఉత్పత్తులు సురక్షితంగా ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని సీవీఎస్ హెల్త్ కార్పొరేషన్ ప్రతినిధి తెలిపారు. ఈ ఉత్పత్తి సురక్షితంగా ఉందని క్లియరాసిల్ తయారీ సంస్థ రెకిట్ బెంకిజర్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. జూన్లో ప్రోయాక్టివ్ తయారీదారు టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను కొనుగోలు చేసిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు.
బెంజీన్ కోసం కొన్ని ఉత్పత్తులను పరీక్షించాలని ఎఫ్డిఎ మొదట 2021 లో మందుల తయారీదారులకు తెలిపింది. ఇందులో బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి హైడ్రోకార్బన్లతో తయారైనవి కూడా ఉంటాయని ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. బెంజీన్ కోసం తమ ఉత్పత్తులను పరీక్షించారా అనే ప్రశ్నలకు ఏ కంపెనీ స్పందించలేదు.
మీరు వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాల జాబితా ఆ ఉత్పత్తి కవర్ పై రాసి ఉంటుంది. అందులో పారాబెన్స్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటివి ఉంటే వాటిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.