Cancer: మీ ఇంట్లో మీకు తెలియకుండా క్యాన్సర్ కారకాలుగా ఉన్న వస్తువులు ఇవే, వీటితో జాగ్రత్త-cancer be careful with these things in your house that are carcinogenic without your knowledge ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer: మీ ఇంట్లో మీకు తెలియకుండా క్యాన్సర్ కారకాలుగా ఉన్న వస్తువులు ఇవే, వీటితో జాగ్రత్త

Cancer: మీ ఇంట్లో మీకు తెలియకుండా క్యాన్సర్ కారకాలుగా ఉన్న వస్తువులు ఇవే, వీటితో జాగ్రత్త

Haritha Chappa HT Telugu
Apr 20, 2024 07:00 AM IST

Cancer: మన ఇంట్లోనే క్యాన్సర్ కారకాలైన ఉత్పత్తులు ఉన్నాయి. ప్లాస్టిక్ కంటైనర్ల నుండి నాన్ స్టిక్ కుక్వేర్ వరకు, కొన్ని గృహోపకరణాలు నిశ్శబ్దంగా మిమ్మల్ని క్యాన్సర్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.

క్యాన్సర్ కలిగించే ఉత్పత్తులు
క్యాన్సర్ కలిగించే ఉత్పత్తులు (Freepik)

మనం పీల్చే గాలి, తినే ఆహారం నుండి సాధారణ గృహోపకరణాల వరకు అన్నీ త్వరగా కలుషితం అయిపోతాయి. ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలు ప్రభావితం చేస్తూనే ఉంది. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి కారకాలతో పాటు, పర్యావరణ కారకాలు కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో మనకు తెలియకుండా మనం వాడే కొన్ని ఉత్పత్తులు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి.

మొదట, మనం ఉపయోగించే అనేక గృహోపకరణాలు కార్సినోజెన్లుగా మారుతున్నాయి. ఇంట్లో వాడే నాన్ స్టిక్ కుక్వేర్, ప్లాస్టిక్ కంటైనర్లు, ఇంటి క్లీనర్ల నుంచి కొవ్వొత్తుల వరకు… అతిగా ఉపయోగించడం ద్వారా అనుకోకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుకుంటున్నాం.

బెంజీన్, ఆస్బెస్టాస్, వినైల్ క్లోరైడ్, రాడాన్, ఆర్సెనిక్, ట్రైక్లోరోఇథిలీన్ వంటి విష పదార్ధాలతో ఇంట్లోని ఉన్న వస్తువులను తయారుచేస్తారు. వీటిని వాడినప్పుడు ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

క్యాన్సర్ కు కారణమయ్యే గృహోపకరణాలు

1. నాన్-స్టిక్ కుక్వేర్: టెఫ్లాన్-కోటెడ్ పాన్‌లను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు హానికరమైన పెర్ఫ్లోరినేటెడ్ రసాయనాలను విడుదల చేస్తాయి. వీటిని దీర్ఘకాలంగా వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వీటిిక బదులు సిరామిక్, కాస్ట్-ఐరన్ వంటపాత్రలను ఎంచుకోండి.

2. కొవ్వొత్తులు: సువాసనల కోసం ఎంతో మంది ప్రతిరోజూ ఇంట్లో కొవ్వొత్తులను వెలిగిస్తారు. వాటిని కాల్చడం వల్ల క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న టోల్యూన్, బెంజీన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. వీటికి బదులు సోయా కొవ్వొత్తులు, బీ వ్యాక్స్ కొవ్వతులను వాడడం మంచిది.

3. పెయింట్లు : కొన్ని రకాల పెయింట్లు, వార్నిష్లు వంటి ద్రావకాలలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టోల్యూన్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం పాటూ వాడడం వల్ల, ఆ గాలిని పీల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

4. ప్లాస్టిక్ కంటైనర్లు: ప్లాస్టిక్ కప్పులు, డబ్బాలను వాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఇంట్లోనూ కుప్పల కొద్దీ ప్లాస్టిక్ కంటైనర్లు ఉంటాయి. ఈ ప్లాస్టిక్ కంటైనర్లలో బిస్ఫెనాల్ ఎ (బిపిఎ), థాలేట్స్ ఉండవచ్చు, ఈ రెండూ కార్సినోజెన్లు. ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి ప్లాస్టిక్ కప్పును వాడకూడదు.

5. గృహ క్లీనర్లు: అనేక సాంప్రదాయ క్లీనింగ్ ఉత్పత్తులలో ఫార్మాల్డిహైడ్, అమ్మోనియా, క్లోరిన్ బ్లీచ్ వంటి క్యాన్సర్ రసాయనాలు ఉంటాయి. వీటి బదులు పర్యావరణ అనుకూల, విషపూరితం కాని ప్రత్యామ్నాయాలను వాడండి. వెనిగర్, బేకింగ్ సోడా వంటి సాధారణ పదార్ధాలను ఉపయోగించడం ఉత్తమం.

6. పురుగుమందులు: పురుగుమందులు మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ రసాయనాలకు గురికావడం వల్ల లుకేమియా, లింఫోమాతో సహా వివిధ క్యాన్సర్లతో ముడిపడి ఉంది. సహజ తెగుళ్ల నియంత్రణ పద్ధతులను పాటించడం ఉత్తమం.

7. విద్యుదయస్కాంత వికిరణం: ఎలక్ట్రానిక్స్ నుండి వై-ఫై రౌటర్ల వరకు విద్యుదయస్కాంత రేడియేషన్ వనరులు మన ఇళ్లలో పుష్కలంగా ఉన్నాయి. వైఫై రౌటర్ల నుంచి వచ్చే విద్యుదయస్కాంత రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

WhatsApp channel

టాపిక్