fatty liver - heart attack: ఫ్యాటీ లివర్‌తో గుండె పోటు వస్తుందా? వైద్యుల మాట ఇదీ-can your fatty liver give you a heart attack here is what experts say ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Can Your Fatty Liver Give You A Heart Attack Here Is What Experts Say

fatty liver - heart attack: ఫ్యాటీ లివర్‌తో గుండె పోటు వస్తుందా? వైద్యుల మాట ఇదీ

HT Telugu Desk HT Telugu
Aug 21, 2023 09:36 AM IST

ఫ్యాటీ లివర్ వల్ల ఏర్పడే లివర్ సిరోసిస్ లేదా కాలేయ క్యాన్సర్ వంటి కాలేయ అనారోగ్యం ఉన్నవారు గుండెపోటుతో చనిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఫ్యాటీ లివర్ వల్ల గుండె పోటు ముప్పు
ఫ్యాటీ లివర్ వల్ల గుండె పోటు ముప్పు (Shutterstock)

ప్రారంభ దశలో ఫ్యాటీ లివర్ వ్యాధి తీవ్రమైన హాని కలిగించదు. ఈ దశలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. చివరకు ఇది అంచలంచెలుగా ముదిరి లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ ముప్పును తెచ్చిపెడుతుంది. అంతేకాదు గుండె సంబంధ వ్యాధులను కూడా కలిగిస్తుంది. కాలేయం పని చేయనప్పుడు, అది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కొవ్వులు, ప్రోటీన్‌లకు సంబంధించిన జీవక్రియ విధులను నిర్వర్తించలేకపోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను లేదా చెడు కొలెస్ట్రాల్ పెంచుతుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

ట్రెండింగ్ వార్తలు

కాలేయ సమస్యలు గుండెపోటు ముప్పు ఎలా పెంచుతాయి?

బెంగళూరు నారాయణ హెల్త్ సిటీ ఎస్.కె. కన్సల్టెంట్, హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డాక్టర్ రవికిరణ్ ఈ అంశంపై మాట్లాడుతూ ఫ్యాటీలివర్, కాలేయ సమస్యల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. "కాలేయ సమస్యలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గుండెపోటు ముప్పు తీవ్రమవుతుంది. కొవ్వుల జీవక్రియ ప్రక్రియలో అవసరమైన ప్రోటీన్‌లను ఉత్పత్తి చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సమతుల్య హృదయనాళ వ్యవస్థను నిర్వహించడానికి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా క్రానిక్ లివర్ డిసీజ్‌ లిపిడ్ మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది.ఈ లిపిడ్ అసమతుల్యత అథెరోస్ల్కెరోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ధమనులు సంకోచిస్తాయి. తద్వారా గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది" అని డాక్టర్ రవికిరణ్ చెప్పారు.

కాలేయం మరియు గుండె జబ్బుల మధ్య అనుబంధం

ఫరీదాబాద్ మారెంగో ఆసియా హాస్పిటల్స్ డాక్టర్ రాకేష్ రాయ్ సప్రా దీనిపై చర్చిస్తూ కాలేయ వ్యాధి, గుండె జబ్బుల మధ్య ఖచ్చితమైన స్పష్టమైన సంబంధం ఉందని, ఫ్యాటీ లివర్ ఉన్నవారు లివర్ సిర్రోసిస్ కంటే గుండెపోటుతో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు.

‘ఫ్యాటీ లివర్ డిసీజ్, హార్ట్ డిసీజ్ రిస్క్ కారకాలు ఒకేలా ఉంటాయి. అందుకే ఫ్యాటీ లివర్ ఉన్నవారు క్రానిక్ లివర్ సిర్రోసిస్ కంటే గుండెపోటుతో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే, లివర్ సిర్రోసిస్ ఉన్న రోగులలో గుండె ఆగిపోవడం, అసాధారణ గుండె లయ, గుండె పోటు సంభవించే అవకాశాలు ఉన్నాయి" అని డాక్టర్ సప్రా చెప్పారు.

"అదేవిధంగా, గుండె సమస్యలు ఉన్న రోగులలో కాలేయ వ్యాధి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాలేయానికి తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దీనిని కార్డియోజెనిక్ అంటారు. ఇస్కీమిక్ హెపటైటిస్, సిరల పీడనం కారణంగా దీర్ఘకాలిక గుండె వైఫల్య స్థితి ఏర్పడుతుంది. దీనిని కార్డియాక్ సిరోసిస్ అంటారు. కాబట్టి, కాలేయం మరియు గుండె జబ్బుల మధ్య సహసంబంధం ఉంది.. ’ అని డాక్టర్ సప్రా వివరించారు.

WhatsApp channel