Weightloss: ఉదయం ఖాళీ పొట్టతో వేడినీరు తాగితే బరువు త్వరగా తగ్గుతారా? ఇది ఎంతవరకు నిజం?
Weightloss: తాజాగా చాలామంది బరువు తగ్గడం ఎలా అనే ప్రశ్న అడుగుతున్నారు. దీనికోసం వందలాది మార్గాలను వెతుకుతున్నారు. బరువు తగ్గడానికి కొన్ని ప్రధాన మార్గాలు ఉన్నాయి. వీటిలో ఉదయం ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం ఒకటి. మరి ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారా? ఇక్కడ సమాధానం.

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు అనేక పద్ధతులను అనుసరిస్తారు. పోషకాహారం తినడంతో పాటూ వ్యాయామం చేయడం వంటివన్నీ బరువు తగ్గే ప్రయాణంలో భాగమే. కొందరు వేగంగా బరువు తగ్గాలని అనేక మార్గాలను వెతుకుతారు. అలాంటి వాటిలో ఒకటి ఉదయాన ఖాళీ పొట్టతో వేడినీరు తాగడం ఒకటి.
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచాక ఖాళీ పొట్టతో వేడినీరు తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా? లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. దీనివల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఖాళీ పొట్టతో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
కేలరీలు బర్న్ అవుతాయి
వేడినీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు కరిగిపోతాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి దోహదపడే అంశాలు.
జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా
వేడి నీరు తాగడం జీర్ణక్రియకు మంచిది. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. వేడినీరు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, కడుపు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
విషపదార్థాలు
వేడినీరు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అందుకే దీన్ని ఖాళీ కడుపుతో తాగడం చాలా ముఖ్యం. ఖాళీ పొట్టతో వేడినీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి, శరీరం తేలికవుతుంది. దీనివల్ల శరీరం శుద్ధి అవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నీటిలో వీటిని కలపండి
వేడినీరు తాగడం మీకు ఇష్టం లేకపోతే, కొన్ని పదార్థాలను కలపవచ్చు. నీటికి కొద్దిగా ఉప్పు కలిపి తాగవచ్చు. ఉప్పునీరు తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. మెగ్నీషియం, సోడియం, పొటాషియం కూడా లభిస్తాయి. వేడినీటికి తేనె కూడా కలపవచ్చు. తేనెలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
రోజంతా వేడినీరు తాగవచ్చు
వేడినీటిని ఉదయం మాత్రమే కాదు, రోజంతా తాగవచ్చు. ఇది బరువు తగ్గించే ప్రయత్నాన్ని మరింత బలపరుస్తుంది. వేగవంతమైన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వేడినీరు మొత్తం ఆరోగ్యానికి మంచిది. ఇది శ్వాసకోశ సమస్యలను నివారించవచ్చు.
వేడినీటి అదనపు ప్రయోజనాలు
వేడినీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అవయవాలకు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది అవయవాలను చురుకుగా ఉంచుతుంది. కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది నోటి ఆరోగ్యానికి కూడా మంచిది. వేడినీరు తాగడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం