Viagra Side Effects on Women : వయాగ్రా మహిళలు కూడా తీసుకోవచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?-can women take viagra know the side effects of blue pill ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Can Women Take Viagra Know The Side Effects Of Blue Pill

Viagra Side Effects on Women : వయాగ్రా మహిళలు కూడా తీసుకోవచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 07:59 PM IST

Viagra Side Effects on Women : వయాగ్రా వారి లైంగిక జీవితాన్ని మెరుగుపరచడంలో పురుషులకు సహాయపడింది. అయితే ఇది మహిళలకు కూడా హెల్ప్ చేస్తుందా? ఇంతకీ మహిళలు వయాగ్రా తీసుకుంటే ఏమౌతుంది? అసలు దీనిని తీసుకోవచ్చా? వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీలు వయాగ్రా తీసుకోవచ్చా?
స్త్రీలు వయాగ్రా తీసుకోవచ్చా?

Viagra Side Effects on Women : అంగస్తంభన సమస్య ఉన్నవారు.. ఎల్లప్పుడూ వయాగ్రా (సిల్డెనాఫిల్)ని ఎంచుకోవచ్చని తెలిసిన విషయమే. ఈ చిన్న నీలం మాత్ర చాలా మంది పురుషులకు వారి లైంగిక జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడింది. అయితే మహిళలు కూడా వయాగ్రాను ఉపయోగించవచ్చా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఒక సాధారణ ఆన్‌లైన్ నిర్వహించిన సర్వేలో "మహిళలు వయాగ్రా తీసుకుంటే ఏమవుతుంది?" వంటి ప్రశ్నలను ఎక్కువ మంది అడిగినట్లు గుర్తించారు. "వయాగ్రా మహిళలపై పని చేయగలదా?" ఇంతకీ వయాగ్రా మహిళలకు కూడా మంచి ఎంపికేనా? దీనిపై సైకియాట్రిస్ట్, సెక్సాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రామన్‌లాల్ కుమావత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవి ఏంటంటే..

వయాగ్రా మహిళలపై కూడా పనిచేస్తుందా?

ఇది చాలా సార్లు తలెత్తే ప్రశ్న. లైంగిక ఉద్వేగం రుగ్మతలకు చికిత్స చేయడానికి వయాగ్రాను మహిళలు కూడా ఉపయోగించవచ్చని డాక్టర్ కుమావత్ తెలిపారు. ఇందులో ఆలస్యమైన ఉద్వేగం లేదా తక్కువ ఉద్వేగం ఉంటాయి. మంచం మీద సంతృప్తి చెందడం ఎల్లప్పుడూ సులభం కాదు. స్త్రీ లైంగిక అసమర్థతలలో ఒకటి లైంగిక ఆసక్తి. వారు లైంగికంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడకపోవచ్చు. ఇది కొన్నిసార్లు హార్మోన్ల మార్పులు లేదా క్యాన్సర్, మధుమేహం లేదా హృదయ సంబంధ వ్యాధుల వంటి అంతర్లీన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినది కావచ్చు.

లైంగిక ప్రేరేపణ సమస్యలు ఉన్న మహిళలు వయాగ్రా తీసుకోవచ్చా?

వయాగ్రా ఎలా పని చేస్తుందంటే.. అది జననాంగాలకు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఆ విధంగా మరింత సున్నితత్వం, మెరుగైన లైంగిక ప్రేరణ కలిగి ఉంటుంది. అయినప్పటికీ.. లైంగిక కోరిక తక్కువగా ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.

వయాగ్రా తీసుకునే మహిళలపై సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

వయాగ్రా ఉద్వేగం పనితీరు, సున్నితత్వం, ఉద్రేకాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ.. ఇది దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఇతర మందులతో సంకర్షణ చెందుతుంది. ఈ దుష్ప్రభావాలు పురుషులు అనుభవించిన వాటితో సమానంగా ఉండవచ్చు. వాస్తవానికి.. కెనడాలోని వాంకోవర్‌లోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. వయాగ్రా లేదా ఇతర అంగస్తంభన మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే తీవ్రమైన కంటి సమస్యలు అభివృద్ధి చెందే ప్రమాదం 85 శాతం పెరుగుతుంది.

మరిన్ని దుష్ప్రభావాలు

• మైకము

• తలనొప్పి

• అల్ప రక్తపోటు

• కళ్ల సమస్యలు.

WhatsApp channel

సంబంధిత కథనం