Skipping for Height: స్కిప్పింగ్ చేస్తే హైట్ పెరుగుతారా? నిజమిదే
Skipping for Height: స్కిప్పింగ్ చేస్తే హైట్ పెరుగుతారని కొందరు అంటుంటారు. పొడవు పెరిగేందుకని ఎక్కువగా చేస్తుంటారు. స్కిప్పింగ్ వల్ల శరీరానికి చాలా మంచిది. మరి స్కిప్పింగ్ చేస్తే ఎత్తు పెరుగుతారా అనేది ఇక్కడ తెలుసుకోండి.
ఓ వయసు దాటాక శరీర పొడవు పెరగడం అనేది జరగదు. సాధారణంగా సుమారు 18 ఏళ్ల వయసు తర్వాత శరీర హైట్ పెరగదు. మనిషి పొడవు అనేది వారసత్వం, జన్యువు, శరీర తత్వం, ఎదిగే సమయంలో తీసుకున్న పోషకాలపై ఆధారపడి ఉంటుంది. పెద్దయ్యాక పొడవు పెరగడం జరగదు. అయితే, స్కిప్పింగ్ చేస్తే పొడవు పెరుగుతారని కొందరు అంటుంటారు. ఇందులో నిజముందా అనేది ఇక్కడ చూడండి.
స్కిప్పింగ్‍తో పొడవు పెరుగుతారా?
స్కిప్పింగ్ శారీరక ఫిట్‍నెస్‍కు చాలా ఉపయోగపడుతుంది. కండరాలు, ఎముకల దృఢత్వం పెరగడం సహా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే, స్కిప్పింగ్ చేస్తే పెద్దయ్యాక కూడా పొడవు పెరుగుతారనేది వాస్తవం కాదు. స్కిప్పింగ్ చేయడం వల్ల హైట్ పెరగడం అనేది ఉండదు. అయితే, శరీరానికి చాలా లాభాలు ఉంటాయి.
పిల్లల్లో ఇలా..
ఎదిగే పిల్లలు స్కిప్పింగ్ చేయడం వల్ల వారి పొడవుకు కాస్త ఉపకరిస్తుంది. అయితే, ఇది కూడా తక్కువే. పిల్లలు హైట్ పెరిగేందుకు తక్కువ స్థాయిలో స్కిప్పింగ్ ఉపయోగపడుతుంది. వారి జన్యువు, శరీర తీరు, తీసుకునే పోషకాహాలు లాంటి విషయాలే పొడవు పెరగడంలో కీలకంగా ఉంటాయి. అయితే, చిన్నప్పటి నుంచి రెగ్యులర్‌గా స్కిప్పింగ్ చేస్తే ఫిట్‍నెస్ మెరుగ్గా ఉంటుంది. శారీరక దృఢత్వం మెరుగ్గా ఉంటుంది.
స్కిప్పింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
స్కిప్పింగ్‍ను పిల్లలు, పెద్దలు అందరూ రెగ్యులర్‌గా చేయవచ్చు. తాడును ఉపయోగించి గెంతుతూ చేసే ఈ స్కిప్పింగ్ శరీరానికి మంచి వ్యాయామంగా ఉంటుంది. చాలా రకాలుగా ప్రయోజనాలు ఇస్తుంది.
- కండరాలు, ఎముకల దృఢత్వం: రెగ్యులర్‌గా స్కిప్పింగ్ చేస్తే కండరాలు, ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ముఖ్యంగా శరీర కింది భాగంలో బలం పెరుగతుంది. కాళ్లు, తొడ కండరాలు పటిష్టమవుతాయి. చేతుల ఫ్లెక్లిబులిటీ కూడా బాగా పెరుగుతుంది. పూర్తి శరీరానికి స్కిప్పింగ్ వ్యాయామంగా ఉంటుంది.
- బరువు తగ్గేందుకు: స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో క్యాలరీలు బాగా బర్న్ అవుతాయి. ఫ్యాట్ కూడా కరుగుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి స్కిప్పింగ్ మంచి ఆప్షన్‍గా ఉంటుంది. వారి వర్కౌట్లలో స్కిప్పింగ్ యాడ్ చేసుకుంటే మరింత మేలు.
- రక్తప్రసరణ: స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని, పనితీరుకు మంచి జరుగుతుంది.
- కీళ్లకు మేలు: స్కిప్పింగ్ చేయడం వల్ల కీళ్ల బలం, ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. ధృఢత్వం పెరుగుతుంది.
- ఊపిరితిత్తులకు..: స్కిప్పింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులకు మేలు జరుగుతుంది. స్కిప్పింగ్ వేగంగా చేస్తే శ్వాస తీసుకొని వదలాల్సి ఉంటుంది. దీనిద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
సంబంధిత కథనం
టాపిక్