Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్న వారు పాలు తాగవచ్చా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నవారి సంఖ్య అధికంగా ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు పాలు తాగడం మంచిదో కాదో అని ఎంతో మంది అనుకుంటారు. వైద్య నిపుణులు థైరాయిడ్ ఉంటే పాలు తాగవచ్చో లేదో వివరిస్తున్నారు.
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. మహిళలే కాదు పురుషులు కూడా థైరాయిడ్ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య ఉంటే రోజూ మందులు వాడడంతో పాటూ కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచాలి. అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు పాలు తాగవచ్చో లేదోనన్న అనుమానం ఎక్కువమందిలో ఉంటుంది. పాలు థైరాయిడ్ సమస్యను పెంచుతుందని చాలా మంది నమ్మకం. అయితే ఇది నిజమా కాదా అనే దానిపై నిపుణులు వివరిస్తున్నారు .

థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయకపోవడం లేదా అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి చురుకుగా ఉండటానికి మందులు ఇస్తారు. అయితే పాలు లేదా కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదో కాదో అని కూడా ఆలోచిస్తారు. దీని గురించి వైద్యులు వివరించారు.
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు బరువు త్వరగా పెరుగుతారు. లేదా తగ్గుతారు. వీరికి మూడ్ స్వింగ్స్ అధికంగా వస్తున్నాయి. అలాగే జుట్టు కూడా రాలిపోతుంది. తీవ్రంగా అలసట వస్తుంది. థైరాయిడ్ సమస్య రెండు రకాలు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపో థైరాయిడిజం వల్ల బరువు పెరుగుతారు. హైపర్ థైరాయిడిజం ఉంటే బరువు తగ్గి సన్నగా మారిపోతారు.
థైరాయిడ్ లో పాలు తాగడం ఆరోగ్యకరమేనా?
పాలలో అయోడిన్ అధికంగా ఉంటుంది. ఈ సందర్భంలో, ఇది థైరాయిడ్ గ్రంథిని చురుకుగా ఉంచడానికి సహాయపడుతుంది. అదే సమయంలో, బలవర్థకమైన పాల ఉత్పత్తులలో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును సరిచేయడానికి సహాయపడుతుంది. ఇది టీఎస్ హెచ్ స్థాయిని కూడా సరిచేస్తుంది. కాబట్టి పాలు, పాల ఉత్పత్తులను పలుమార్లు తీసుకోవడం మంచిది. కాబట్టివ పాలు తాగడానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ గ్లాసుడు పాలు తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.
ఎండోక్రైన్ సొసైటీ నివేదిక ప్రకారం, ఒక గ్లాసు పాలు తాగడం వల్ల శరీరంలో లెవోథైరాక్సిన్ మందు శోషణ తగ్గుతుంది. అంటే పాలు తాగడం వల్ల పూర్తి మోతాదులో ఔషధం శరీరంలోకి శోషించుకోలేదు. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే లెవోథైరాక్సిన్ మందు ఎక్కువగా ఇస్తూ ఉంటారు.
పరిశోధనల ప్రకారం, ఈ మందు తినడానికి నాలుగు నుండి ఆరు గంటల ముందు పాలు తీసుకోవడం వల్ల శరీరంలో శోషణ పూర్తిగా జరుగుతుంది. అదే సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. థైరాయిడ్ పనితీరు కూడా మెరుగుపడుతుంది. కాబట్టి థైరాయిడ్ ట్లాబ్లెట్ వేసుకోవడానికి పాలు తాగడానికి మధ్య కనీసం ఆరు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి.
పాలు రోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ పాలు తాగేవారికి కాల్షియం లోపం రాకుండా ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్