Weight loss Cauliflower: బరువు తగ్గాలనుకునే వారు క్యాలీఫ్లవర్ రెగ్యులర్‌గా తినొచ్చా?
Weight loss Cauliflower: బరువు తగ్గాలనుకునే వారికి ఆహారం విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఈ క్రమంలోనే వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చా అనేది చాలా మందిలో ఉండే డౌట్. దానికి సమాధానం ఇక్కడ తెలుకోండి.
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు ఏం తినాలో.. ఏం తినకూడదో అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యేందుకు డైట్, వ్యాయామం చాలా ముఖ్యం. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్‍లో ఉండేలా చూసుకుంటే బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. దీంతో ఆహారాల విషయంలో డౌట్లు వస్తుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు డైలీ క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చా అనే సందేహం వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా క్యాలీఫ్లవర్ తినొచ్చు. ఇందులోని ఫైబర్ సహా మరిన్ని పోషకాలు ఇందుకు సహకరిస్తాయి. వెయిట్ లాస్‍కు క్యాలీఫ్లవర్ ఎలా ఉపయోగపడుతుందంటే..
క్యాలరీలు తక్కువగా..
క్యాలీఫ్లవర్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల్లో సుమారు 25 గ్రాముల క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనివల్ల క్యాలీఫ్లవర్ కాస్త ఎక్కువగా తిన్నా క్యాలరీ కౌంట్ పెరగదు. ఇది తింటే చాలా సేపటి వరకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మాటిమాటికీ ఆకలి కాకుండా.. ఎక్కువ తినకూండా చేయగలదు. బరువు తగ్గాలంటే క్యాలరీలు తక్కువగా తీసుకోవడం ముఖ్యం.
ఫైబర్ పుష్కలం
క్యాలీఫ్లవర్‌లో ఫైబర్ మెండుగా ఉంటుంది. కప్ క్యాలీఫ్లవర్‌లో సుమారు రెండు గ్రాముల డైయటరీ ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను కాస్త నెమ్మదింపజేసి.. కడుపు ఫుల్‍గా ఉన్న భావనను క్యాలీఫ్లవర్ ఇస్తుంది. పేగుల కదలికలను కూడా ఇది మెరుగుపరచగలదు. మలబద్ధకం లాంటి సమస్య తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో నుంచి వ్యర్థాలు సులువుగా బయటికిపోయేలా చేస్తుంది. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
పోషకాల వల్ల..
క్యాలీఫ్లవర్‌లో ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సీ, కే, పొటాషియం, ఫోలెస్ సహా మరిన్ని పోషకాలు క్యాలీఫ్లవర్‌లో మెండుగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహకరించడంతో పాటు పూర్తిస్థాయి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని గ్లూకోసినోలేట్స్, ఐసోతియోసియనేట్స్.. ఇన్‍ఫ్లమేషన్‍ను తగ్గిస్తాయి. ఊబకాయం తగ్గేలా సహకరిస్తాయి.
వాటర్ కంటెంట్ ఎక్కువగా..
క్యాలీఫ్లవర్‌లో సుమారు 92 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. శరీరానికి హైడ్రేషన్ అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా కడుపు నిండినట్టు ఫీల్ అయ్యేలా చేయగలదు. అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. క్యాలరీలు బర్న్ అయ్యేందుకు జీవక్రియ మెరుగ్గా ఉండాలంటే సరైన హైడ్రేషన్ చాలా ముఖ్యం.
కార్బొహైట్రేట్లు తక్కువగా..
క్యాలీఫ్లవర్‌లో కార్బొహైట్రేడ్లు కూడా తక్కువగా ఉంటాయి. ఓ కప్పు క్యాలీఫ్లవర్‌లో సుమారు 4.9 గ్రాముల కార్బొహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అదే కప్పు అన్నంలో ఏకంగా 45 గ్రాముల కార్బ్స్ ఉంటాయి. కార్బొహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించుకోవాలంటే క్యాలిఫ్లవర్‌ను భోజనంలో ఎక్కువగా తీసుకోవచ్చు. కొవ్వు కరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
క్యాలీఫ్లవర్‌లో గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా ఆకలి తగ్గుతుంది. ఎక్కువగా తినడాన్ని ఇది కూడా నిరోధిస్తుంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. ప్రోబయోటిక్‍గానూ క్యాలీఫ్లవర్ ఉపయోగపడుతుంది. దీంతో పేరుగుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మొత్తంగా బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా డైట్‍లో క్యాలీఫ్లవర్ తినొచ్చు
సంబంధిత కథనం